Ajinkya Rahane : బీసీసీఐ నుంచి నెలకు రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు అంటే?
ఇటీవలే క్రికెట్‌కు అజింక్య రహానే (Ajinkya Rahane) వీడ్కోలు పలికాడు.
- Thota Vamshi Kumar
- Updated on- August 2, 2026 / 03:47 PM IST
Ajinkya Rahane To Receive Fixed Monthly Pension From BCCI
Ajinkya Rahane : ఇటీవలే క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు పలికాడు. భారత్ జట్టు తరుపున అతడు 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు టెస్టుల్లో ఆరు మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించగా ఒక్క మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓడిపోలేదు. అతడి నాయకత్వంలో టీమ్ఇండియా ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆట నుంచి వీడ్కోలు పలకడంతో ఇప్పటి నుంచి ప్రతి నెల అతడికి బీసీసీఐ నుంచి పెన్షన్ అందనుంది. బీసీసీఐ పెన్షన్ నిబంధనల ప్రకారం అతడు అతడు అత్యధిక శ్రేణి జాబితాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నెలకు రూ.70 వేలు అతడి ఖాతాలో జమ కానున్నాయి.
ఎన్ని సంవత్సరాలు పెన్షన్ అందనుందంటే?
బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆటగాడి జీవితాంతం బీసీసీఐ పెన్షన్ చెల్లిస్తుంది. అయితే.. ఒకవేళ ఆటగాడు బోర్డులో ఏదైన అధికారిక పదవి చేపడితే మాత్రం పెన్షన్ ఆగిపోతుంది. ఆ పదవికి సంబంధించిన జీతభత్యాలు అతడికి అందుతాయి. సౌరవ్ గంగూలీ మాదిరిగా పాలకమండలి పదవి లేదా గంభీర్ మాదిరిగా కోచ్‌గా ఉంటే పెన్షన్ అందరు. మళ్లీ ఆ పదవి నుంచి వైదొగిలిన తరువాత నుంచి పెన్షన్ అందడం ప్రారంభం అవుతుంది.
