Bhuvneshwar Kumar : ఇన్నాళ్లు భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డానికి అజిత్ అగార్క‌రే కార‌ణం? షాకింగ్ రిపోర్టు!

టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ (Bhuvneshwar Kumar ) దాదాపు నాలుగేళ్ల త‌రువాత టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

Ajit Agarkar Factor Behind Bhuvneshwar Kumar Absence From Team India

Bhuvneshwar Kumar : టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ దాదాపు నాలుగేళ్ల త‌రువాత టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అక్టోబ‌ర్ 22 నుంచి న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించిన భార‌త జ‌ట్టులో భువీ చోటు ద‌క్కించుకున్నాడు. 36 ఏళ్ల ఈ స్వింగ్ సుల్తాన్ చివరిసారిగా 2022లో భారత్ తరఫున ఆడాడు.

ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు వ‌రుస‌గా రెండో సారి టైటిల్ గెల‌వ‌డంలో భువీ కీల‌క పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఈ స్వింగ్ కింగ్ త‌న స్వింగ్, సీమ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. మొత్తంగా 17 వికెట్లు తీశాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు టీమ్ఇండియాలోకి ఎంపిక అయ్యాడు.

అగార్క‌ర్ ఉన్న‌ప్పుడు ప‌ట్టించుకోలేదు ?

మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హయాంలో భువనేశ్వర్ పునరాగమనం జరగలేదు. ఎందుకంటే అనుభవజ్ఞులైన ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికి కూడా వారిని తిరిగి జాతీయ‌జ‌ట్టులోకి తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని స‌మాచారం. భువనేశ్వర్‌ను జట్టులోకి తీసుకోవడం విషయంలో సెంట్రల్ జోన్ సెలెక్టర్ రుద్ర ప్రతాప్ సింగ్‌కు పెద్దగా మద్దతు లభించలేదని తెలుస్తోంది.

Shreyas Iyer : నాతో పాటు అక్ష‌ర్ క‌ళ్లు ఎర్ర‌బ‌డ్డాయి.. ఇక ఈ రాత్రి.. తొలి టీ20లో విజ‌యం త‌రువాత శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్..

అయితే.. అగార్కర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న ప్రజ్ఞాన్ ఓజా, ఇతర సెలెక్టర్లు భువనేశ్వర్‌ను తిరిగి జ‌ట్టులోకి తీసుకునే విష‌యంలో పెద్దగా అభ్యంత‌రం చెప్పలేద‌ని స‌మాచారం. ముఖ్యంగా జ‌స్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేని పరిస్థితుల్లో భువనేశ్వర్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని సెలెక్టర్లు భావించిన‌ట్లు తెలుస్తోంది.

భువనేశ్వర్ తన అనుభవంతో యువ పేసర్లు మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లకు కూడా మార్గనిర్దేశం చేయగలడని భావిస్తున్నారు. 2028 టీ20 ప్రపంచకప్‌కు సంభావ్య ఆటగాళ్లుగా వీరిద్దరినీ చూస్తున్న నేపథ్యంలో భువనేశ్వర్ అనుభవం వారికి ఉపయోగపడే అవకాశం ఉంది.

భువనేశ్వర్ భారత్ తరఫున ఇప్పటివరకు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 63, వ‌న్డేల్లో 141, టీ20ల్లో 90 వికెట్లు తీశాడు. అగార్కర్ తప్పుకున్న తర్వాత.. ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రకటించిన తొలి టీ20 జట్టు ఇదే. గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరమైన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఈ జట్టులో చోటు ద‌క్కించుకున్నాడు.

Shai Hope : చాలా సంతోషంగా ఉంది.. అదొక్క‌టే మేం చేసిన మిస్టేక్ .. లేదంట‌నే..వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీల‌క వ్యాఖ్య‌లు..

ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న భారత ఆటగాళ్లలో ఎక్కువ మంది తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. భువనేశ్వర్ పునరాగమనం మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి కూడా ప్రేరణగా మారే అవకాశం ఉంది.

భార‌త్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 22న – క్రైస్ట్‌చర్చ్‌
* రెండో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 24న – క్రైస్ట్‌చర్చ్‌
* మూడో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 27న – వెల్లింగ్టన్‌
* నాలుగో టీ20 మ్యాచ్ – అక్టోబ‌ర్ 30న – ఆక్లాండ్‌
* ఐదో టీ20 మ్యాచ్ – నవంబ‌ర్ 1న – హామిల్టన్‌

టీ20 సిరీస్ అనంతరం ఇరు జట్లు ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి.

కివీస్‌తో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

శ్రేయ‌స్‌ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్‌), అక్షర్ పటేల్, శివ‌మ్‌ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మ‌యాంక్ యాద‌వ్, అర్ష్‌దీప్ సింగ్, భువ‌న్వేశ‌ర్ కుమార్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్.