క్రికెట్ చరిత్రలో సంచలనం : 10 మంది డకౌట్.. ఆ ఒక్కరు కూడా..

క్రికెట్‌లో బ్యాటింగ్ పొజిషన్‌లో ఎవరు ఉన్నా.. అందిన బంతిని బౌండరీకి బాదాలనే ప్రయత్నిస్తారు. కనీసం వీలు కుదిరితే ఒక్క పరుగైనా చేయాలని కష్టపడతారు. కానీ, ఆ జట్టులో ఒకరు మినహాయించి మిగిలినవారంతా డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ వింత ఆస్ట్రేలియా దేశీవాలీ క్రికెట్‌లో చోటు చేసుకుంది. దేశవాళీ టోర్నీలో భాగంగా న్యూ సౌత్ వేల్స్.. దక్షిణ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి6న జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డును మూట గట్టుకుంది. 

ఇంకొక గమనించదగ్గ విషయం ఏంటంటే ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణ ఆస్ట్రేలియా జట్టు ప్రత్యర్థికి కేవలం 11 పరుగుల టార్గెట్ మాత్రమే ఇచ్చింది. జట్టులో స్కోరు నమోదు చేసిన ఆ ఒక్కరు చేసింది నాలుగు పరుగులు మాత్రమే. ఆ జట్టులో మాన్సెల్‌ 33 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసింది. మిగతావన్నీ ఎక్స్‌ట్రాలే. 

న్యూసౌత్‌ వేల్స్‌ బౌలర్‌ వాన్‌ వీన్‌ చాకచక్యంగా బౌలింగ్ చేసి ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టింది. నవోమి వుడ్స్‌ వేసిన రెండు బంతుల్లో వికెట్లు తీసుకుంది. పది మంది ఖాతానే తెరవకున్నా.. దక్షిణ ఆస్ట్రేలియా జట్టు 10.2 ఓవర్లు ఆడి 10 పరుగులు చేయడం విశేషం. చేధనలో న్యూసౌత్‌వేల్స్‌ 2 వికెట్లు కోల్పోయి 15 బంతుల్లో లక్ష్యాన్ని అందుకుంది.