Amar Singh Devanda : IAU ఆసియా ఓషియానిక్ ఛాంపియన్‌షిప్‌లో పోటీల్లో స్వ‌ర్ణం గెలిచిన అమ‌ర్‌సింగ్ దేవందా

ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఏప్రిల్ 6-7 మ‌ధ్య జ‌రిగిన 2024 IAU ఆసియా ఓషియానిక్ ఛాంపియన్‌షిప్‌లో పోటీల్లో భార‌త దేశానికి చెందిన అమ‌ర్‌సింగ్ దేవందా స్వ‌ర్ణం సాధించారు.

Amar Singh Devanda wins gold medal in 2024 IAU 24H Asia and Oceania Championships

Amar Singh Devanda : ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఏప్రిల్ 6-7 మ‌ధ్య జ‌రిగిన 2024 IAU ఆసియా ఓషియానిక్ ఛాంపియన్‌షిప్‌లో పోటీల్లో భార‌త దేశానికి చెందిన అమ‌ర్‌సింగ్ దేవందా స్వ‌ర్ణం సాధించారు. అల్ట్రా మారథార‌న్‌లో అత‌డు 24 గంట‌ల్లో 272.537 కి.మీలను కవర్ చేస్తూ కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఈ క్ర‌మంలో అత‌డిని అభినందిస్తూ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది.

‘కాన్‌బెర్రాలో జరిగిన 24 గంటల IAU ఆసియా ఓషియానిక్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించినందుకు భారత అల్ట్రామారథాన్ జట్టు నుండి కార్పోరల్ అమర్ సింగ్ దేవందను #IAF అభినందించింది. Cpl అమర్ 24 గంటల్లో 272.537 కిలోమీటర్లు ప్రయాణించి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. IAFకి ఇది గర్వించదగిన క్షణం.’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చింది.

Virat Kohli : కారు డోరు తెరిచేందుకు తంటాలు ప‌డ్డ కోహ్లి! వీడియో వైర‌ల్‌..