IPL 2026 Auction : విధ్వంసకర బ్యాటర్‌ను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసిన కావ్య పాప.. ఇక దబిడిదిబిడే.. కానీ..

IPL 2026 Mini Auction: ఐపీఎల్ -2026 మినీవేలం ప్రక్రియ ముగిసింది. ఈ వేలంలో సన్‌రైజర్స్ యాజమాన్యం ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను కళ్లు చెదిరే ధరకు

IPL 2026 Auction : విధ్వంసకర బ్యాటర్‌ను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసిన కావ్య పాప.. ఇక దబిడిదిబిడే.. కానీ..

IPL 2026 Mini Auction

Updated On : December 16, 2025 / 11:04 PM IST

IPL 2026 Mini Auction : ఐపీఎల్ -2026 మినీవేలం ప్రక్రియ ముగిసింది. ఈ వేలంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అత్యధికంగా రూ.25.20 కోట్ల ధర పలికాడు. గ్రీన్‌ను కోల్‌కతా ప్రాంచైజీ కొనుగోలు చేసింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక ఆటగాళ్లను దక్కించుకుంది.

Also Read: IPL 2026 Auction : ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-10 ప్లేయర్లు వీరే..

సన్‌రైజర్స్ యాజమాన్యం ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసింది. రూ.2కోట్ల బెస్ ప్రైస్‌తో వేలం తొలి రౌండ్లోకి వచ్చిన లివింగ్ స్టోన్‌ను దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. కానీ, యాక్సలరేటెడ్ రౌండ్లో మాత్రం అతని కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఎస్ఆర్‌హెచ్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య లివింగ్ స్టోన్ కోసం పోటీ జరిగింది. చివరికి ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం రూ.13కోట్ల భారీ ధరకు అతన్ని దక్కించుకుంది.

గత సీజన్లో ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో భారీ ధరకు లియామ్ లివింగ్‌స్టోన్‌‌ను బెంగళూర్ దక్కించుకుంది. రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినా ఘోరంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బౌలింగ్‌లోనూ పెద్దగా రాణించింది లేదు. 38 సగటుతో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్, పవర్ హిట్టర్‌ను ఆర్సీబీ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ -2026 మినీ వేలంలో అతన్ని ఎస్ఆర్‌హెచ్ యాజమన్యం భారీ ధరతో దక్కించుకుంది. ఈ సీజన్లో అతను ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.


సన్ రైజర్స్ సొంతం చేసుకున్న ఆలగాళ్లు వీళ్లే..
లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.13 కోట్లు), సలీల్ అరోరా (రూ.1.5 కోట్లు), శివంగ్ కుమార్ (రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలే (రూ.30 లక్షలు), అమిత్ కుమార్ (రూ.30 లక్షలు), ప్రఫులే హింగే (రూ.30 లక్షలు), క్రెయిన్స్ (రూ.30 లక్షలు), శివమ్ మావి (రూ.75 లక్షలు).