IPL 2026 : ఐపీఎల్ 2026.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే..
IPL 2026 : ఐపీఎల్ -2026 మినీవేలం ప్రక్రియ మంగళవారం ముగిసింది. అన్ని ప్రాంఛైజీలు కలిపి రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 77 మంది ప్లేయర్లను ఆయా జట్టు కొనుగోలు చేశాయి.
IPL 2026 SRH Team
IPL 2026 : ఐపీఎల్ -2026 మినీవేలం ప్రక్రియ మంగళవారం ముగిసింది. అన్ని ప్రాంఛైజీలు కలిపి రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 77 మంది ప్లేయర్లను ఆయా జట్టు కొనుగోలు చేశాయి. ఇందులో విదేశీ ప్లేయర్లు 29 మంది ఉన్నారు. ఈ వేలంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అత్యధికంగా రూ.25.20 కోట్ల ధర పలికాడు. గ్రీన్‌ను కోల్‌కతా ప్రాంచైజీ కొనుగోలు చేసింది. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు లియామ్ లివింగ్‌స్టోన్ ను రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read : IPL 2026 Auction : విధ్వంసకర బ్యాటర్‌ను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసిన కావ్య పాప.. ఇక దబిడిదిబిడే.. కానీ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే ..
రిటెన్షన్స్ : అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, ఎషాన్ మలింగ, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జయ్‌దేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, స్మరన్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్, జిషన్ అన్సారీ.
మినీ వేలంలో దక్కించుకున్న ప్లేయర్లు : లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.13 కోట్లు), జాక్ ఎడ్వర్డ్స్ (3కోట్లు), సలీల్ అరోరా (రూ.1.5 కోట్లు), శివంగ్ కుమార్ (రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలే (రూ.30 లక్షలు), అమిత్ కుమార్ (రూ.30 లక్షలు), ప్రఫులే హింగే (రూ.30 లక్షలు), క్రెయిన్స్ (రూ.30 లక్షలు), శివమ్ మావి (రూ.75 లక్షలు).
