Andre Russell : ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్.. సరికొత్త పాత్రలో..
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- November 30, 2025 / 01:03 PM IST
Andre Russell announces retirement from IPL
Andre Russell : ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రస్సెల్‌ను ఇటీవల వేలానికి కేకేఆర్ వదిలేసింది. ఈ క్రమంలోనే అతడు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నాను. ఇది ఎంతో కఠినమైన నిర్ణయం. 12 సీజన్లు ఆడాను. కేకేఆర్ కుటుంబంతో ఎంతో ప్రేమ, మధురజ్ఞాపకాలు ఉన్నాయి. అంటూ ఆండ్రీ రస్సెల్ చెప్పుకొచ్చాడు. తాను రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికి కూడా ఐపీఎల్‌లో తనను చూడొచ్చునని తెలిపాడు. తాను కేకేఆర్ సపార్ట్ సాఫ్ట్‌లో భాగం అవుతానని తెలిపాడు. 2026లో పవర్ ఫుల్ కోచ్ పాత్రలో చూస్తారని తెలిపాడు.
37 ఏళ్ల రస్సెల్ 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీలో చేరి ఆ జట్టులో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకరిగా ఎదిగాడు. రస్సెల్ కేకేఆర్ తరపున 133 మ్యాచ్‌లు ఆడాడు. 2014, 2024లో కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
