Anushka Sharma: తన భర్త విరాట్ కెప్టెన్సీ రిటైర్మెంట్‌పై అనుష్క హార్ట్ ఫుల్ మెసేజ్

నాలుగేళ్ల ప్రేమ తర్వాత వివాహంతో ఒకటైన ఈ జంట పెళ్లికి ముందు ప్రతి రోజూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచేవారు. శనివారం విరాట్ తన టెస్టు కెప్టెన్సీకి కూడా రిటైర్మెంట్ చెప్పేయడంతో అనుష్క

Virushka

Anushka Sharma: విభిన్న రంగాలైనా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. నాలుగేళ్ల ప్రేమ తర్వాత వివాహంతో ఒకటైన ఈ జంట పెళ్లికి ముందు ప్రతి రోజూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచేవారు. శనివారం విరాట్ తన టెస్టు కెప్టెన్సీకి కూడా రిటైర్మెంట్ చెప్పేయడంతో అనుష్క శర్మ ఇన్‌స్టాలో హార్ట్ ఫుల్ పోస్టు పెట్టారు.

ఫ్యాన్స్, ఫాలోవర్లు తనను అభిమానించే వాళ్లకు విరాట్ అంటే ఏంటో తెలుసని, ఏడేళ్ల కెప్టెన్సీలో చాలా సాధించావని ప్రశంసలు కురిపిస్తూ పోస్టు చేశారు అనుష్క.

‘2014లో టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని ఎంఎస్‌ నిర్ణయించుకున్న రోజున నిన్ను కెప్టెన్‌గా చేశారని నువ్వు చెప్పిన రోజు నాకు గుర్తుంది. ఆ రోజు తర్వాత ధోనీ, నువ్వు & నేను చాట్ చేయడం నాకింకా గుర్తుంది. మీ గడ్డం త్వరగా నెరిసిపోతుందని ధోనీ సరదాగా అన్నాడు. దాని గురించి బాగా నవ్వుకున్నాం. అప్పటి నుంచి నీ గడ్డం నెరిసిపోవడమే కాకుండా చాలానే చూశా. నీ ఇంప్రూవ్మెంట్ చూశా. అంతర్గతంగా కూడా’ అని అనుష్క రాసింది.

ఇది కూడా చదవండి : కాంగ్రెస్‌‌లోకి డీఎస్.. ముహూర్తం ఫిక్స్

‘నువ్వు దురాశతో ఏమీ చేయలేదు. ఈ స్థానం గురించి కూడా అలాంటివేం చేయలేదని నాకు తెలుసు. నువ్వు దేనినైనా చాలా గట్టిగా నమ్మినప్పుడు దానికి కట్టుబడి ఉంటారు. నువ్వు, నా ప్రేమ అపరిమితమైనవి. ఈ 7 ఏళ్ల మన ప్రయాణం చూసి మన కూతురు చాలా నేర్చుకుంటుంది’ అని పోస్ట్‌ను ముగించారు.

ట్రెండింగ్ వార్తలు