Sachin birthday : తండ్రి సచిన్‌కు బర్త్ డే విషెస్ చెప్పి కేక్ తినేందుకు నిరాకరించిన అర్జున్ టెండూల్కర్..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (sachin birthday)పుట్టిన రోజు ఈరోజు (ఏప్రిల్ 21).
- Thota Vamshi Kumar
- Updated on- April 24, 2026 / 12:51 PM IST
Arjun Wishes Sachin Tendulkar But Says Cant Eat Cake
- క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బర్త్ డే
- శుభాకాంక్షలు తెలియజేసిన కుమారుడు అర్జున్ టెండూల్కర్
sachin birthday : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు ఈరోజు (ఏప్రిల్ 21). ఈ దిగ్గజ ఆటగాడు శుక్రవారం 53వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా క్రీడా, రాజకీయ, సినీ సెలబ్రెటీలతో పాటు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సచిన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి సచిన్‌కు శుభాకాంక్షలు తెలియజేయాడు. అయితే.. కేక్ తినేందుకు మాత్రం నిరాకరించాడు.
అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడుతున్నాడు. అయితే.. ఈ సీజన్‌లో అతడికి తుది జట్టులో స్థానంలో దక్కడం లేదు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
Virat Kohli : గుజరాత్‌తో మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే.. 1 సిక్స్, 92 రన్స్..
ఇదిలా ఉంటే.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అర్జున్ టెండూల్కర్ చిన్న కేక్ ముక్కను చూపిస్తూ తండ్రి సచిన్ టెండూల్కర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. తన డైట్‌లో భాగంగా తీపి వస్తువులు తినడం లేదని, ఈ క్రమంలోనే కేక్‌ను సైతం తినని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక సచిన్ టెండూల్కర్ విషయానికి వస్తే.. 1989 నుంచి 2013 వరకు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 200 టెస్టులు, 463 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్‌లో భారత్ తరుపున ఆడాడు. టెస్టుల్లో 15921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 18426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఒకే ఒక టీ20 మ్యాచ్‌లో 10 పరుగులు సాధించాడు. 78 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 2334 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 13 అర్థశతకాలు ఉన్నాయి.
క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సచిన్ పేరిట ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డులను దాదాపుగా బ్రేక్ చేయడం కష్టం.
