Virat Kohli Record : గుజరాత్‌తో మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే.. 1 సిక్స్, 92 రన్స్..
Virat Kohli Record: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli )ని పలు రికార్డులు ఊరిస్తున్నాయి
IPL 2026 RCB vs GT match Virat Kohli eye on these two records (pic credit@ipl)
- నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్
- విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రెండు రికార్డులు
- 300 సిక్సులు, 9 వేల పరుగులు
Virat Kohli : ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ని పలు రికార్డులు ఊరిస్తున్నాయి
ఈ మ్యాచ్‌లో గనుక కోహ్లీ 92 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్లో 9 వేల పరుగులు మైలురాయిని చేరుకుంటాడు. అదే సమయంలో ఐపీఎల్లో 9 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
*చెన్నై మ్యాచ్ ఆడుతున్నా మైదానానికి రానీ ధోని.. ఉద్దేశపూర్వకంగానే సీఎస్కేకు దూరంగా ఉంటున్నాడా?
ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి కోహ్లీ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు అతడు 273 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 265 ఇన్నింగ్స్‌ల్లో 39.8 సగటుతో 8908 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఒక్క సిక్స్ కొడితే..
ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఒక్క సిక్స్ కొడితే.. ఐపీఎల్లో 300 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. క్రిస్ గేల్, రోహిత్ శర్మ మాత్రమే కోహ్లీ కన్నా ముందు ఐపీఎల్లో 300 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నారు.
*ఓటమికి సాకులు చెప్పడం లేదు.. నిజంగా మా కొంపముంచింది అదే.. హార్దిక్ పాండ్యా కామెంట్స్..
ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్లిన ప్లేయర్లు వీరే..
- క్రిస్‌గేల్ – 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు
- రోహిత్ శర్మ – 276 మ్యాచ్‌ల్లో 310 సిక్సర్లు
- విరాట్ కోహ్లీ – 273 మ్యాచ్‌ల్లో 299 సిక్సర్లు
- ఎంస్ ధోని – 278 మ్యాచ్‌ల్లో 299 సిక్సర్లు
- ఏబీ డివిలియర్స్ – 184 మ్యాచ్‌ల్లో 251 సిక్సర్లు
