MS Dhoni : చెన్నై మ్యాచ్ ఆడుతున్నా మైదానానికి రానీ ధోని.. ఉద్దేశపూర్వకంగానే సీఎస్కేకు దూరంగా ఉంటున్నాడా?
చెన్నై సూపర్ కింగ్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni ) అనడంలో అతిశయోక్తి లేదేమో.
IPL 2026 Is MS Dhoni Deliberately Staying Away From CSK (pic credit@csk)
- ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడని ధోని
- పిక్క గాయంతో బాధపడుతున్నాడని వెల్లడించిన సీఎస్కే
- మ్యాచ్ ఆడకపోయినా.. కనీసం సీఎస్కే ఆడుతుంటే మైదానంలోకి రానీ ధోని
- కావాలనే దూరంగా ఉంటున్నాడా?
MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదేమో. ఐపీఎల్ లీగ్ ఆరంభం నుంచి ఆ జట్టుకు అన్నీ తానై ముందుకు నడిపించాడు. ఐదు సార్లు ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.
2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. 44 ఏళ్ల ఈ కుడి చేతి వాటం ఆటగాడు ప్రస్తుతం కెరీర్ చరమాంకంలో ఉన్నాడు అన్నది నిజం. ఇప్పటికే సీఎస్కే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న ఈ ఆటగాడు కేవలం ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. ధోని తరువాత జడేజా నాయకత్వ బాధ్యతలు అందుకున్నప్పటికి కూడా మధ్యలోనే వదిలేశాడు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్‌లు కెప్టెన్పీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికి కూడా ధోని తరహాలో జట్టును సరైన దిశలో నడిపించలేకపోతున్నాడు.
MI vs CSK : చీటింగ్ చేసిన ముంబై..! శాంట్నర్ బదులు శార్దూల్.. వివరణ ఇచ్చిన జయవర్ధనే..
ప్రస్తుతం పిక్కల్లో గాయంతో ధోని బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంబైతో మ్యాచ్‌కు ముందు అతడు ప్రాక్టీస్ చేసినట్లుగా సీఎస్కే ఫ్రాంచైజీ వీడియోలు విడుదల చేసినప్పటికి కూడా అతడు ఆడలేదు.
ఇదిలా ఉంటే.. ధోని జట్టుకు కాస్త దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మ్యాచ్‌లు ఆడకపోతే పోయిండు గానీ.. స్టేడియానికి కూడా అతడు రావడం లేదు. ఈ నేపథ్యంలో అతడు కావాలనే జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక కివీస్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ధోని ఫిట్‌గానే ఉన్నాడని, అయితే.. కొత్త నాయకత్వానికి స్వేచ్ఛనిచ్చే క్రమంలోనే అతడు జట్టుకు కాస్త దూరంగా ఉంటున్నాడని అన్నాడు. తాను లేకున్నా కూడా సీఎస్కే ముందుకు సాగేలా అలవాటు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.
ఎంఎస్ ధోని దిగ్గజ కెప్టెన్. అయినప్పటికి కూడా అతడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? అతడు కావాలనే జట్టుకు దూరంగా ఉంటున్నాడని అనిపిస్తోంది. అతడు లేకున్నా సరే జట్టుకు ముందుకు సాగేలా ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాడు అనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త నాయకత్వ బృందంపై దృష్టి పడేలా చేస్తున్నాడు. జట్టును వారు తమ చేతుల్లోకి తీసుకునేలా చేస్తున్నాడు. అని డౌల్ అన్నాడు.
కాగా.. ఈ సీజన్‌కు ముందు వరకు ధోని మైదానంలో రుతురాజ్‌కు సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఈ సారి అలా కాకుండా.. తాను లేకున్నా సరే సీఎస్కే ముందుకు సాగుతుందని, ఫ్యాన్స్‌కు అర్ధమయ్యేలా చేయడమే ధోని ఉద్దేశ్యంలా కనిపిస్తోంది. సంజూ శాంసన్ రావడంతో చరిష్మా వచ్చిందని, ఈ క్రమంలోనే తాను ఆట నుంచి తప్పుకునేందుకు ధోని సిద్ధం అయ్యాడని అంటున్నారు.
