Ravichandran Ashwin : పాక్ క్రికెట్ ప్ర‌స్తుత ప‌రిస్థితి పై ర‌విచంద్ర‌న్ అశ్విన్

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఓడిపోయి తీవ్ర నిరాశ‌లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల‌కు స్టార్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజాం షాకిచ్చాడు

Ashwin feels sorry for Pakistan amid musical chairs over captaincy ft Babar Azam

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఓడిపోయిన‌ నిరాశ‌లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల‌కు స్టార్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజాం షాకిచ్చాడు. పరిమిత ఓవ‌ర్ల క్రికెట్ కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దీంతో ఆ బాధ్య‌త‌లు ఎవ‌రికి అప్ప‌గిస్తారు అనే చ‌ర్చ ప్రారంభ‌మైంది. కెప్టెన్సీ కి సంబంధించిన కుర్చీలాట మొద‌లైంద‌ని క్రికెట్ వ‌ర్గాలు చేస్తున్న కామెంట్ల పై భార‌త సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ స్పందించాడు.

ప్ర‌స్తుతం పాక్ జ‌ట్టు ప‌రిస్థితిని చూసి జాలి ప‌డ్డాడు. త‌ర‌చుగా సార‌థుల‌ను మార్చ‌డం వల్ల ఆ టీమ్‌లో అయోమ‌యం నెల‌కొంద‌న్నాడు. ఇక‌నైనా ప్లేయ‌ర్లు వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న పై దృష్టి సారించాల‌ని సూచించాడు. నిజాయతీగా చెప్పాలంటే పాక్ క్రికెట్ ప్ర‌స్తుత ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నాడు. ఎంతో మంది గొప్ప ఆట‌గాళ్లు ఆ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించారు. ఆ టీమ్ గొప్ప విజ‌యాల‌ను న‌మోదు చేసింది.

Harmanpreet Kaur : మ‌హిళా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌.. న్యూజిలాండ్ చేతిలో భార‌త్ ఓట‌మి.. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కామెంట్స్‌..

ప్ర‌పంచ మేటీ టీమ్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తుంటే జాలివేస్తోంది. పోనీ అక్క‌డ నైపుణ్య‌మైన ఆట‌గాళ్ల‌కు కొద‌వ ఉందా అంటే అదేం లేదు. ఎంతో మంచి ప్లేయ‌ర్లు అందుబాటులో ఉన్నారు. అయితే.. బోర్డులో చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌ల‌తో ఆ జ‌ట్టు ప‌త‌నావ‌స్థ‌కు చేరుకుంది. కుర్చీలాట‌తో మ‌రింత దిగ‌జారుతోంది. దాదాపు 1000 రోజులుగా గెల‌వ‌లేదంటే స‌మ‌స్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.అని అశ్విన్ అన్నాడు.

ప్ర‌తి ఒక్క ఆట‌గాడు త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న మీద దృష్టి పెట్టాలన్నాడు. అదే స‌మ‌యంలో జ‌ట్టు విజ‌యం సాధించేలా చూడాలన్నాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్ వాతావ‌ర‌ణం ఆహ్లాదంగా ఉండాల‌ని, అంతేకానీ ఏ క్రికెట‌ర్ కూడా జ‌ట్టు కంటే వ్య‌క్తిగ‌తానికి ప్రాధాన్యం ఇవ్వ‌కూడ‌ద‌ని అశ్విన్ తెలిపాడు.

Womens T20 World Cup 2024 : కివీస్ చేతిలో ఘోర‌ ఓట‌మి.. భార‌త్ సెమీస్ చేరాలంటే..?