Asia Cup 2023: ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాక్ తలపడ్డ మ్యాచ్‌ల వివరాలు ఇలా.. పైచేయి ఎవరిదంటే?

1984లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు పదహారు సార్లు తలపడ్డాయి. వన్డే ఫార్మాట్‌లో 13 మ్యాచ్‌లు ఆడగా.. మూడు మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో తలపడ్డాయి.

Asia cup

IND vs PK Match: ఆసియా కప్ – 2023 టోర్నీ ప్రారంభమైంది. రెండు మ్యాచ్‌లు జరగ్గా పాకిస్థాన్, శ్రీలంక జట్లు విజయం సాధించాయి. ఆసియా కప్‌లో హైవోల్టేజీ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. శనివారం సాయంత్రం పాకిస్థాన్ , ఇండియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దాయాది జట్ల మధ్య పోరుకోసం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగి తలపడితే క్రికెట్ ప్రియులకు కలిగే ఆ కిక్కేవేరు.
Asia Cup 2023: భారత్‌పై గెలవలేకపోయినప్పటికీ పాక్ ఈ పని చేయొద్దు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

1984లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు పదహారు సార్లు తలపడ్డాయి. వన్డే ఫార్మాట్‌లో 13 మ్యాచ్‌లు ఆడగా.. మూడు మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో తలపడ్డాయి. అయితే, భారత్ జట్టు ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లో విజేతగా నిలవడగా.. పాకిస్థాన్ జట్టు ఐదు వన్డే మ్యాచ్‌లు, ఒక టీ20 మ్యాచ్ మొత్తం ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించింది.

Asia Cup 2023: ఆసియా కప్ మాత్రమే కాదు.. వన్డే ప్రపంచ కప్ మ్యాచులూ ఫ్రీగా చూడొచ్చు..

ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్.. 

– 1984 ఏప్రిల్ 3న షార్జాలో ఇండియా – పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.
– 1988 అక్టోబర్ 31న ఢాకాలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌‍లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 1995 ఏప్రిల్ 7న షార్జాలో మ్యాచ్ జరగ్గా. పాకిస్థాన్ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది.
– 1997 జూలై 20న కొలంబోలో మ్యాచ్ ఎటువంటి పోటీలేకుండా ముగిసింది.
– 2000 జూన్3న ఢాకాలో మ్యాచ్ జరగ్గా పాకిస్థాన్ జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
– 2004 జూలై 25న కొలంబోలో మ్యాచ్ జరగ్గా.. పాకిస్థాన్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.
– 2008జూన్ 26న కరాచీలో మ్యాచ్ జరగగా టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 2008 జూలై2న కరాచీలో మ్యాచ్ జరగ్గా పాకిస్థాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 2010 జూన్ 19న దంబుల్లాలో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 2012 మార్చి18న మీర్పూర్ లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది
– 2014 మార్చి2న మీర్పూర్ లో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.
-2016 ఫ్రిబవరి 27న టీ20 ఫార్మాట్ మీర్పూర్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 2018 సెప్టెంబర్ 19న దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 2018 సెప్టెంబర్ 23న భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 2022 ఆగస్టు 28న దుబాయ్ లో టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ జరగ్గా భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
– 2022 సెప్టెంబర్ 4న టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ జరిగింది. పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో టీమింయాను ఓడించింది.

ట్రెండింగ్ వార్తలు