Asia Cup 2025 Suryakumar Yadav comments after india win against OMAN
Suryakumar Yadav : ఆసియాకప్ 2025లో భాగంగా అబుదాబి వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒమన్ తమ స్థాయికి మించిన ప్రదర్శన చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఏకపక్ష విజయాలు అందుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో కాస్త కష్టంగానే గెలుపొందింది. బంతితో, బ్యాట్‌తో రాణించిన ఒమన్.. భారత్‌కు ఓటమి భయాన్ని కలిగించింది. ఓ దశలో ఆ జట్టు ఊపు చూస్తే సంచలన విజయాన్ని అందుకుంటుందేమో అని అనిపించింది. కానీ ఆఖర్లో బ్యాటర్లలో తడబడడంతో భారత్‌కు అవమాన భారం తప్పింది.
ఈ మ్యాచ్‌లో ఒమన్ ఓటమిపాలైనప్పటికి కూడా ఆ జట్టు ప్రదర్శన ఆకట్టుకుందని భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) అన్నాడు. మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. ఒమన్ పై ప్రశంసల జట్లు కురిపించాడు. ఒమన్ అద్భుత ప్రదర్శన చేసిందన్నాడు. ఆ జట్టు బ్యాటింగ్ బాగా చేసిందని, వారి ఆటను తాను ఆస్వాదించానని చెప్పుకొచ్చాడు. ఒమన్ కోచ్ సులక్షణ్ కురకర్ణి గురించా తనకు తెలుసునన్నాడు. ఆయన వల్లే ఒమన్ మెరుగ్గా రాణించిందన్నాడు.
Sanju Samson : టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్ అరుదైన ఘనత.. ఎంఎస్ ధోని సిక్సర్ల రికార్డు బ్రేక్..
ఇక టీమ్ఇండియా ప్లేయర్ల గురించి మాట్లాడుతూ.. ఎక్కువ బెంచీపై కూర్చొని ఒక్కసారిగా బరిలోకి దిగి రాణించడం కొంచెం కష్టం అని అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలను ఉద్దేశించి అన్నాడు. అబుదాబిలో వాతావరణం చాలా వేడిగా ఉందన్నాడు. ఇక హార్దిక్ ఔటైన తీరు దురదృష్టకరం అని చెప్పాడు. అయినప్పటి అతడు ఆట నుంచి దూరం కాలేదన్నాడు. అతడు బౌలింగ్ చేసిన విధానం అద్భుతం అని అన్నాడు. సూపర్ 4 మ్యాచ్‌లకు అన్ని విధాల సిద్దంగా ఉన్నాం అని ఆదివారం పాక్‌తో జరగబోయే పోరును ఉద్దేశించి సూర్య చెప్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ (56; 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ (38; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (29; 18 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) లు వేగంగా ఆడారు. ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, ఆమిర్ కలీమ్, జితేన్ రామనంది లు తలా రెండు వికెట్లు సాధించారు.
Arshdeep Singh : చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు..
అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ కలీమ్ (64; 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), హమ్మద్ మీర్జా (51; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలు చేశారు. కెప్టెన్ జతిందర్ (32; 33 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ సాధించారు.