AUS-W vs IND-W 3rd ODI Alyssa Healy century India Women target is 410 runs
AUS-W vs IND-W : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. తన కెరీర్‌లో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ (158; 98 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీ చేసింది.
ఆమెతో పాటు బెత్ మూనీ (106 నాటౌట్; 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకంతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 410 పరుగుల లక్ష్యం నిలిచింది.
– Final ODI of the Career.
– Alyssa Healy Scoring Hundred.
– Mitchell Starc in commentary box.CRICKET IS BEAUTIFUL, AN ICONIC MOMENT IN SPORTING HISTORY 🥹 pic.twitter.com/94515hVY6a
— Johns. (@CricCrazyJohns) March 1, 2026
ఆసీస్ బ్యాటర్లలో జార్జియా వాల్ (62; 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసింది. నికోలా కారీ (34 నాటౌట్; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, శ్రీచరణిలు చెరో రెండు వికెట్లు తీశారు. రేణుకా సింగ్ ఠాకూర్, కాష్వీ గౌతమ్, దీప్తి శర్మలు తలా ఓ వికెట్ తీశారు.
A target of 410 runs for #TeamIndia to chase down 🎯
Over to our batters now.
Scorecard ▶️ https://t.co/PqlLKl0Fz3#AUSvIND pic.twitter.com/6hRFHe4EAh
— BCCI Women (@BCCIWomen) March 1, 2026
తొలి రెండు వన్డే మ్యాచ్‌ల్లో ఆసీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టే గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది.