Glenn Maxwell : అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్‌మెంట్..

Glenn Maxwell : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

Australia star all rounder Glenn Maxwell retires from international cricket

Glenn Maxwell : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. 38 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ ఆట‌గాడు 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆసీస్ త‌రుపున చివ‌రి మ్యాచ్‌ను ఆడేశాడు. త‌న‌ 14 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్ ప‌ట్ల సంతృప్తిని వ్య‌క్తం చేశాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినప్ప‌టికి కూడా ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొన‌సాగ‌నున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో అత‌డు మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

Hardik Pandya : ముంబైకి హార్దిక్ పాండ్యా గుడ్‌బై..! KKR భారీ ప్లాన్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లతో బిగ్ డీల్.. రంగంలోకి CSK..?

2012లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మాక్స్‌వెల్ ఆసీస్ త‌రుపున 7 టెస్టులు, 149 వ‌న్డేలు, 130 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 26.1 స‌గటుతో 339 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ ఉంది. వ‌న్డేల్లో 33.8 స‌గ‌టుతో 3990 ప‌రుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచ‌రీలు, 23 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 29 స‌గ‌టుతో 2897 ప‌రుగులు చేశాడు. ఇందులో ఐదు శ‌త‌కాలు, 12 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక అత‌డి బౌలింగ్ విష‌యానికి వ‌స్తే.. టెస్టుల్లో 8, వ‌న్డేల్లో 77, టీ20ల్లో 51 వికెట్లు సాధించాడు.

2015, 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌ను, 2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌ను కైవ‌సం చేసుకున్న ఆసీస్ జ‌ట్టులో అత‌డు స‌భ్యుడిగా ఉన్నాడు.

బ్యాట్‌తో విధ్వంసం సృష్టించే మాక్స్‌వెల్ వైట్ బాల్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా ఎదిగాడు. 2023 వ‌న్డే ప్రపంచకప్‌లో ల‌క్ష్య ఛేద‌న‌లో అఫ్గానిస్తాన్‌పై అతను సాధించిన డబుల్ సెంచరీ.. అత‌డి ప్రతిభకు, వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచింది.