విశాఖలో మరో పండుగ : భారత్ – ఆసీస్ రెండో వన్డే

  • Publish Date - January 23, 2019 / 03:24 PM IST

* ఫిబ్రవరి 27న మ్యాచ్‌
* ఏర్పాట్లపై సమీక్షించిన కమిటీ
* భారత్‌–ఆస్ట్రేలియా  రెండో టీ20 మ్యాచ్‌

విశాఖపట్టణం : మరో క్రికెట్ పండుగ జరగనుంది. భారత్‌–ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌ వచ్చే నేల 27న జరగనుంది.. ఈ మ్యాచ్‌ నిర్వహక కమిటీ ఇప్పటికే సమావేశమై ఏర్పాట్లపై చర్చించింది. టికెట్ల రేట్లు, ఎప్పటినుంచి విక్రయాలు ప్రారంభించాలన్న అంశాలపై చర్చించడంతోపాటు నిర్వహణకు సంబంధించిసబ్‌ కమిటీలను నియమించారు. 
భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ విశాఖలో వచ్చేనెల ఫిబ్రవరి 27న జరగనుంది. భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ఇరు దేశాల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ను విశాఖలోని వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆడనుంది.

టికెట్ల ధరలు : 
ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 24న జరగనుంది. రెండో టీ20 మ్యాచ్‌కు  విశాఖ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 27న రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. మ్యాచ్‌ను తిలకించేందుకు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఈవెంట్స్ నౌ వెబ్‌సైట్‌ ద్వారా విక్రయించనున్నారు. ధరలు  రూ.500, 1200, 1600, 2000, 4000 డినామినేషన్లలో టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 20 మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సహం నెలకొంది. అదిరిపోయె సిక్స్‌లు, పోర్లు  ఈ మ్యాచ్ లో చూడవచ్చు