ఓ థర్డ్ అంపైర్.. అది నో-బాల్ : పాక్ ఫ్యాన్స్ ఫైర్

  • Publish Date - November 21, 2019 / 02:27 PM IST

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య గబ్బా వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆటలో ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ నోబాల్ వేశాడు. అదే బంతికి పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ తీశాడు. బౌలింగ్ వేసే సమయంలో కమిన్స్.. లైన్ తొక్కి నో బాల్ వేయడం.. రిజ్వాన్ వికెట్ తీయడం.. థర్డ్ అంపైర్ చూసి ఔట్ డిక్లేర్ చేయడం.. ఇదంతా వివాదాస్పదానికి దారితీసింది. రిజ్వాన్ ఔట్ పై టీవీ రిప్లేలో స్పష్టంగా నోబాల్ అని కనిపించినప్పటికీ టీవీ అంపైర్ మిచెల్ గఫ్.. ఔట్ ఇవ్వడంపై ట్విట్టర్ వేదికగా పాక్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రీప్లేలు చెకింగ్ చేసినప్పటికీ నోబాల్ అని చెప్పకపోవడంపై అంపైర్ తప్పుడు నిర్ణయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రీప్లేలో కమిన్స్ పాదం లైన్ పైనే ఉందని, వెనుక కాదనేది స్పష్టంగా కనిపిస్తోందంటూ ఏకిపారేశారు. ‘ఓ థర్డ్ అంపైర్.. కచ్చితంగా అది నోబాల్.. ఔట్ ఎట్టిస్తావ్.. అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు. అంపైరింగ్ అందంగా చేశావు. అప్పటి రోజుల్లో స్టీవ్ బక్నర్, బెన్సన్ లను మళ్లీ గుర్తుచేశారు’ అని మరో యూజర్ వ్యంగంగా ట్వీట్ చేశాడు. టెక్నాలజీ, టీవీ స్క్రీన్ చూస్తే సరైన నిర్ణయం తీసుకోవాలి. మిచెల్ గఫ్ కు ఫైన్ విధించాలి.. క్షమించొద్దు.. అని మరో యూజర్ ట్వీట్ చేశాడు. 

మొదటి సెషన్ లో తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. లంచ్ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది. అసద్ షఫీక్ తో కలిసి రిజ్వాన్ కౌంటర్ ఎటాక్ చేశాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో 37 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్‌లో రిజ్వాన్ వికెట్ కోల్పోయాడు. నిజానికి అది నో బాల్.. రిజ్వాన్ ఔట్ కాదు.. కమిన్స్ నో బాల్ వేసినా.. అంపైర్ ఔట్ ఇవ్వడంపై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.