IND-W vs AUS-W
IND-W vs AUS-W 3rd T20 : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచులో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. ముంబై వేదికగా జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను ఆసీస్ 2-1తో గెలుచుకుంది. 148 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 18.4 ఓవర్లలో మూడు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో అలిస్సా హీలీ (55; 38 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్), బెత్ మూనీ (52నాటౌట్ ;45 బంతుల్లో 5 ఫోర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు తీసింది. దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టింది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్ (34; 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), స్మృతి మంధాన (29; 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్), షఫాలీ వర్మ ( 26; 17 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించారు. జెమీమా రోడ్రిగ్స్ (2), హర్మన్‌ప్రీత్ కౌర్ (3), దీప్తి శర్మ (14) లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్, వర్హెమ్ చెరో రెండు వికెట్లు తీశారు. మెగాన్ షట్, గార్డనర్ లు చెరో వికెట్ పడగొట్టారు.
Rohit Sharma : టీ20ల్లో పలు రికార్డులపై రోహిత్ శర్మ కన్ను.. మూడు మ్యాచుల్లో సాధిస్తాడా..?
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు మొదటి వికెట్‌కు 39 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ధాటిగా ఆడుతున్న షఫాలీని మేగన్ ఔట్ చేసింది. జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు విఫలం కాగా.. మంధాన సైతం పెలియన్‌కు చేరడంతో 66 పరుగులకే నాలుగ వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో దీప్తి శర్మతో కలిసి రిచా ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతలను భుజాన వేసుకుంది. దీప్తి ఔట్ అయినా చివర్లో అమన్‌జ్యోత్ కౌర్ ( 17 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు) రాణించడంతో భారత్ ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైంది.
David Warner : ఆత్మకథ రాస్తున్న డేవిడ్ వార్నర్.. జస్ట్ 2వేల పేజీలేనట.. చదివితే..