Rohit Sharma : టీ20ల్లో ప‌లు రికార్డుల‌పై రోహిత్ శ‌ర్మ క‌న్ను.. మూడు మ్యాచుల్లో సాధిస్తాడా..?

అఫ్గానిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది.

Rohit Sharma : టీ20ల్లో ప‌లు రికార్డుల‌పై రోహిత్ శ‌ర్మ క‌న్ను.. మూడు మ్యాచుల్లో సాధిస్తాడా..?

Rohit Sharma

Rohit Sharma-Virat Kohli : టీమ్ఇండియా కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ దాదాపు 14 నెల‌ల త‌రువాత టీ20 జ‌ట్టులోకి వ‌చ్చాడు. చివ‌రిసారిగా టీమ్ఇండియా త‌రుపున 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో ఆడాడు. జ‌న‌వ‌రి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. అయితే.. ఈ సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశం ఉంది.

– ఈ మూడు మ్యాచుల సిరీస్‌లో రోహిత్ 147 ప‌రుగులు సాధిస్తే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 4 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటారు. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ త‌రువాత ఈ ఘ‌న‌త సాధించిన రెండో ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు.

– ఒక‌వేళ 156 ప‌రుగులు చేస్తే కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌నున్నాడు. 4008 ప‌రుగుల‌తో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు.

– టీ20 క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ నాలుగు సెంచ‌రీలు బాదాడు. అఫ్గాన్ సిరీస్‌లో మ‌రో సెంచ‌రీ చేస్తే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు.

– మ‌రో హాఫ్ సెంచ‌రీ చేస్తే పాకిస్తాన్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజామ్ 30 అర్ధ‌శ‌త‌కాల రికార్డును రోహిత్ స‌మం చేస్తాడు.

David Warner : ఆత్మ‌క‌థ రాస్తున్న డేవిడ్ వార్న‌ర్‌.. జ‌స్ట్ 2వేల పేజీలేన‌ట‌.. చ‌దివితే..

– మ‌రో 9 బౌండ‌రీలు కొడితే టీ20 ఫార్మాట్‌లో అత్య‌ధిక బౌండ‌రీలు కొట్టిన ప్లేయ‌ర్‌గా రోహిత్ నిల‌వ‌నున్నాడు. ప్ర‌స్తుతం విరాట్ 356 బౌండ‌రీల‌తో తొలి స్థానంలో ఉండ‌గా.. రోహిత్ 348 బౌండ‌రీల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

– మ‌రో 44 ప‌రుగులు చేస్తే అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త కెప్టెన్‌గా నిల‌వ‌నున్నాడు. ప్ర‌స్తుతం కోహ్లీ 1570 ప‌రుగుల‌తో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. 1527 ప‌రుగ‌ల‌తో రోహిత్ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శుభ్‌మ‌న్‌ గిల్, య‌శ‌స్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), శివమ్ దూబే, వాషింగ్ట‌న్‌ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

Aakash Chopra : వైస్ కెప్టెన్‌కి చోటు లేదా..? ఇషాన్ కిష‌న్ ప‌రిస్థితేంటి..?

భారత్ vs అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* జ‌న‌వ‌రి 11న తొలి టీ20 – మొహాలి
* జ‌న‌వ‌రి 14న రెండ‌వ టీ20 – ఇండోర్‌
* జ‌న‌వ‌రి 17న మూడో టీ20 – బెంగ‌ళూరు