Australia won by 2 wickets against India in 2nd ODI and win series one match spare
IND vs AUS: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా కైవసం(IND vs AUS) చేసుకుంది. అడిలైడ్ వేదికగా భారత్‌తో ఉత్కంఠగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
265 పరుగుల లక్ష్యాన్ని 46.2 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ (74; 78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కూపర్ కొన్నోలీ (61 నాటౌట్; 53 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. మిగిలిన వారిలో మిచెల్ ఓవెన్ (36), మాట్ రెన్షా (30) లు రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ సాధించారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (73; 97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (61; 77 బంతుల్లో 7 ఫోర్లు) లు అర్ధశకాలు చేశారు. అక్షర్ పటేల్ (44; 41 బంతుల్లో 5 ఫోర్లు), హర్షిత్ రాణా (24 నాటౌట్ 18 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు.
మిగిలిన వారిలో విరాట్ కోహ్లీ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ (11), శుభ్‌మన్ గిల్ (9), వాషింగ్టన్ సుందర్ (12), నితీశ్ కుమార్ రెడ్డి (8)లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్‌లెట్ మూడు వికెట్లు సాధించాడు. మిచెల్ స్టార్ రెండు వికెట్లు సాధించాడు