Punjab Kings : ఐపీఎల్ 2026కి ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం.. స్పిన్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే..
ఐపీఎల్ 2026 ముందు పంజాబ్ కింగ్స్ కీలక (Punjab Kings) నిర్ణయం తీసుకుంది. స్పిన్ బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేని నియమించింది.

Punjab Kings appoint Sairaj Bahutule as spin bowling coach ahead of IPL 2026
Punjab Kings : ఐపీఎల్ 2026 ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేని నియమించింది. సునీల్ జోషి స్థానంలో బహుతులేను నియమించారు. సునీల్ జోషి 2023 నుంచి 2025 వరకు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశారు.
ఐపీఎల్ 2025 సీజన్ వరకు సాయిరాజ్ బహుతులే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. ఇటీవల అతడిని ఆర్ఆర్ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆర్ఆర్ విడుదల చేయగానే పంజాబ్ సాయిరాజ్ బహుతులేను తమ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా తీసుకుంది.
Harshit Rana : విమర్శకుల నోరు మూయించిన హర్షిత్ రాణా.. గంభీర్ నమ్మకాన్ని నిలబెడుతూ..
51 ఏళ్ల బహుతులే గతంలో బెంగాల్, కేరళ, విదర్భ, గుజరాత్ వంటి జట్లతో కలిసి పనిచేశాడు. అన్ని ఫార్మాట్లలో భారత యువ బౌలర్లను మెరికలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించడంతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది.
పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీష్ మీనన్ మాట్లాడుతూ.. ‘పంజాబ్ కింగ్స్‌కు సునీల్ జోషి కొన్నేళ్ల పాటు సేవ చేశాడు. అతడి అంకితభావం, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు సాయిరాజ్ బహుతులేను మా కోచింగ్ బృందంలోకి స్వాగతిస్తున్నాం. ఇందుకు సంతోషంగా ఉంది. ఆటపై అతడికి ఉన్న అవగాహన, ముఖ్యంగా దేశీయ బౌలర్లను మెరికలుగా తీర్చిదిద్దడం, వ్యూహాలను రచించడంలో అతడి అనుభవం పంజాబ్ కింగ్స్‌కు కలిసి వస్తుందని భావిస్తున్నాం.’అని సతీష్ తెలిపాడు.
Rohit Sharma : సెంచరీ మిస్.. అయితేనేం గంగూలీ రికార్డును మాత్రం మిస్‌కానీ రోహిత్ శర్మ..
Spin Bowling Coach, Sairaj Bahutule is now a 🦁! 🔥 pic.twitter.com/xBGvDCYvyF
— Punjab Kings (@PunjabKingsIPL) October 23, 2025
ఐపీఎల్ 2026 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ కోచింగ్ బృందంలో చేరడం నిజంగా సంతోషంగా ఉందని సాయిరాజ్ బహుతులే చెప్పారు. ‘ఈ జట్టులో వేరే బ్రాండ్ క్రికెట్ ఆడుతారు. సామర్థ్యం చాలా ఎక్కువ. జట్టులో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి, వారు కొత్త శిఖరాలను చేరుకోవడానికి సాయపడటానికి, వారితో కలిసి పనిచేయడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను.’ అని సాయిరాజ్ బహుతులే అన్నారు.
పంజాబ్ కింగ్స్‌కు రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా ఉన్నారు. బ్రాడ్ హాడిన్, జేమ్స్ హోప్స్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు. ఇప్పుడు బహుతులే స్పిన్ కోచ్‌గా చేరారు.