Harshit Rana : విమర్శకుల నోరు మూయించిన హర్షిత్ రాణా.. గంభీర్ నమ్మకాన్ని నిలబెడుతూ..
టీమ్ఇండియా యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) ఆసీస్‌తో రెండో వన్డేలో బ్యాట్‌తో రాణించాడు.
IND vs AUS 2nd ODI Harshit Rana silences critics with fine cameo
Harshit Rana : ఆస్ట్రేలియా టూర్‌కు యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేసినప్పటి నుంచి సెలక్టర్లపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. గంభీర్‌కు ప్రియ శిష్యుడు కావడంతోనే అతడిని ఎంపిక చేస్తున్నారని మాజీ ఆటగాళ్లు సైతం బహిరంగంగా విమర్శించారు. ఆసీస్‌తో తొలి వన్డేలో అటు బ్యాట్, ఇటు బాల్‌తో హర్షిత్ రాణా విఫలం కావడంతో ఈ విమర్శల జడివాన ఇంకా ఎక్కువ అయింది.
అయితే.. అతడి ప్రతిభ ఆధారంగా జట్టులో చోటు దక్కించుకున్నాడని టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ విమర్శల పై కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గంభీర్ మాటలను నిజం చేస్తూ ఆసీస్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో హర్షిత్ బ్యాట్‌తో చెలరేగాడు. అడిలైడ్‌లో ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆఖరిలో కీలక పరుగులను రాబట్టాడు.
Rohit Sharma : సెంచరీ మిస్.. అయితేనేం గంగూలీ రికార్డును మాత్రం మిస్‌కానీ రోహిత్ శర్మ..
Harshit Rana scored 24 unbeaten runs off 18 balls. It’s not a massive contribution but it clearly shows that he can bat. All those who troll him 24×7 will not a say a word about his good cameo. These runs can be a deciding factor sometimes. #INDvsAUS pic.twitter.com/eS6dTxiygJ
— Madhav Sharma (@HashTagCricket) October 23, 2025
18 బంతులను ఎదుర్కొన్న అతడు మూడు ఫోర్లు సాయంతో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడు 133.33 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయడం గమనార్హం. హర్షిత్ ఇన్నింగ్స్ కారణంగానే భారత్ స్కోరు 260 పరుగులు దాటింది. ఈ క్రమంలో హర్షిత్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. లోయర్ ఆర్డర్ లో ఉపయుక్తమైన బ్యాటర్ అంటూ పలువురు కొనియాడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (73; 97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (61; 77 బంతుల్లో 7 ఫోర్లు) లు అర్ధశతకాలు చేశారు. అక్షర్ పటేల్ (44; 41 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు, జేవియర్ బార్ట్‌లెట్ మూడు, మిచెల్ స్టార్ రెండు వికెట్లు తీశారు.
