Virat Kohli : వరుసగా రెండు డకౌట్లు.. చేతి గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం.. రిటైర్‌మెంట్‌కు సంకేతమా ?
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో ఔటైన తరువాత కోహ్లీ (Virat Kohli) చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

IND vs AUS 2nd ODI Virat Kohli Gesture For Crowd Triggers Retirement Chatter
Virat Kohli : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీకి తన వన్డే కెరీర్‌లో ఇలా ఎప్పుడూ జరగలేదు. వరుసగా అతడు రెండు వన్డే మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 8 బంతులు ఆడి ఔటైన కోహ్లీ గురువారం ఆసీస్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో నాలుగు బంతులు ఆడి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం కోహ్లీ చర్చనీయాంశంగా మారాడు.
దాదాపు ఏడు నెలల తరువాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లీకి ఏదీ కలిసిరావడం లేదు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న పరుగుల యంత్రం కనీసం పరుగుల ఖాతా తెరవలేకపోతున్నాడు. తొలి వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఫీల్డర్ చేతికి చిక్కాడు.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఆసీస్ గడ్డపై ఏకైక భారత ఆటగాడు..
VIRAT KOHLI GONE FOR HIS SECOND DUCK OF THE SERIES!#AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/jqIdvMeX9T
— cricket.com.au (@cricketcomau) October 23, 2025
దీంతో రెండో వన్డేలో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించగా మరోసారి నిరాశే ఎదురైంది. జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. కనీసం అతడు డీఆర్ఎస్ కూడా తీసుకోలేదు. పైగా డగౌట్‌కు వెలుతున్న సమయంలో అతడు తన చేతి గ్లౌజులు తీసి వాటితో ప్రేక్షకులకు అభివాదం చేసుకుంటూ వెళ్లాడు.
Womens World Cup 2025 : న్యూజిలాండ్‌తో చావో రేవో మ్యాచ్.. భారత్ ఆ బలహీనతను అధిగమిస్తుందా?
కోహ్లీ చేసిన ఈ పనితో అతడి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆసీస్‌తో వన్డే సిరీస్ అనంతరం అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడా? అనే టాపిక్ మొదలైంది. ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.
Is Virat King Kohli retiring? #INDvsAUS pic.twitter.com/Sbkienpgmq
— jollyengineer (@bigrcbfan) October 23, 2025
The way Kohli thanked the fans actually scares me a bit pic.twitter.com/m6jUUEsytr
— Kevin (@imkevin149) October 23, 2025