Australian Open 2024 : ఆస్ట్రేలియన్ ఓపెన్‌ సింగిల్స్ విజేత‌గా 22 ఏళ్ల కుర్రాడు.. ఎవ‌రో తెలుసా..?

ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత‌గా ఇట‌లీ యువ సంచ‌ల‌నం జ‌నిక్ సిన‌ర్ నిలిచాడు.

Jannik Sinner

ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత‌గా ఇట‌లీ యువ సంచ‌ల‌నం జ‌నిక్ సిన‌ర్ నిలిచాడు. మెల్‌బోర్న్‌లోని రాడ్‌ లీవర్‌ ఎరీనా వేదిక‌గా ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచులో ర‌ష్యాకు చెందిన డానియల్ మెద్వెదేవ్ ను ఓడించారు. 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో గెలుపొందిన సిన‌ర్ తొలిసారి ఆస్ట్రేలియ‌న్ విజేత‌గా నిలిచాడు. 1959,1960లో వరుసగా రోలాండ్ గారోస్ టైటిల్‌లను గెలుచుకున్న నికోలా పిట్రాంజెలీ, 1976 రోలాండ్ గారోస్‌లో టైటిల్‌ను గెలుచుకున్న అడ్రియానో ​​పనట్టా తర్వాత గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మూడవ ఇటాలియన్ ఆట‌గాడిగా సిన‌ర్ రికార్డుల‌కు ఎక్కాడు.

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైన‌ల్ మ్యాచులో 22 ఏళ్ల‌ సిన‌ర్ మొద‌టి రెండు సెట్ల‌ను కోల్పోయాడు. అయితే.. కీల‌క మైన మూడో సెట్‌లో పుంజుకున్న సిన‌ర్ 6-4తో గెలిచి మ్యాచులో నిలిచాడు. ఆ త‌రువాత నాలుగో సెట్ 6-4తో కైవ‌సం చేసుకున్నాడు.

Hardik Pandya : హార్దిక్ పాండ్య ఎమోష‌న‌ల్.. ‘ప్ర‌తి రోజు నా శ‌క్తినంతా ధార‌పోస్తున్నా.. ఇది నా దేవాల‌యం’

మెద్వెదేవ్, సిన‌ర్‌ లు చెరో రెండు సెట్‌లు గెలుచుకోవ‌డంతో మ్యాచ్ ఐదో సెట్‌కు దారి తీసింది. ఐదో సెట్‌లోనూ త‌న‌దైన ఆట‌తో విజృంభించిన సిన‌ర్ ఐదో సెట్‌ను గెల‌వ‌డంతో పాటు మ్యాచ్ లో విజ‌యం సాధించి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

భారీగా ప్రైజ్‌మ‌నీ..

ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత‌గా నిలిచిన జ‌నిక్ సిన‌ర్ కు 31,50,000 ఆస్ట్రేలియా డాల‌ర్లు ప్రైజ్‌మ‌నీగా ల‌భించింది. అంటే భార‌త క‌రెన్సీలో దాదాపు రూ.17.25కోట్లు. ఇక ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన డానియల్ మెద్వెదేవ్ 17,25,000 ఆస్ట్రేలియన్ డాల‌ర్లు అంటే భార‌త కరెన్సీలో రూ.9.42 కోట్లు ద‌క్కింది.

WTC Points table : ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు భారీ షాక్‌.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు..!