Babar Azam : ‘నా దగ్గరికి రావొద్దు.. దూరంగా వెళ్లండి..’ ఫ్యాన్స్ పై చిర్రుబుర్రులాడిన బాబర్ ఆజాం.. వీడియో
పాకిస్తాన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 29, 2024 / 04:28 PM IST
Babar Azam Frustration With Overzealous Fans In Cardiff
Babar Azam Frustration : ప్రస్తుతం పాకిస్తాన్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇంగ్లీష్ జట్టుతో నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. వరుణుడు ఆటంకం కలిగించడంతో మొదటి, మూడో టీ20 మ్యాచులు రద్దు అయ్యాయి. రెండో టీ20లో ఇంగ్లాండ్ జట్టు 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌కు ముందు చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అభిమానులతో గొడవకు దిగడం కనిపించింది.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం ఇంగ్లాండ్‌లోని వీధుల్లో సరదాగా తిరుగుతున్నాడు. ఆ సమయంలో అతడిని అభిమానులు చుట్టుముట్టారు. సెల్ఫీలు, వీడియోలు కావాలని అభ్యర్థించారు. అయితే.. సహనం కోల్పోయిన బాబర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాకో 2 నిమిషాలు ఇస్తారా? అంటూ గట్టిగా అరిచాడు. ఫ్యాన్స్‌ను దూరంగా వెళ్లిపోవాలని కోరాడు.
MS Dhoni : టీమ్ఇండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి ధోని అర్హుడు కాదా? ఎందుకంటే?
దీంతో అభిమానులు అతడికి కొంత దూరంగా వెళ్లారు. అప్పటికీ కూడా బాబర్‌కు కోపం తగ్గలేదు. తన వద్దకు రావొద్దని, వీడియోలు తీయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొద్ది సమయం తరువాత శాంతించిన బాబర్ ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొద్ది మంది బాబర్‌కు మద్దతుగా, మరికొందరు అతడికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ పై అలా వ్యవహరించడం తగదని ఓ వర్గం అంటుంటే..? సెలబ్రెటీలకు వ్యక్తిగత జీవితం ఉంటుందని ఇంకొందరు చెబుతన్నారు.
