Suryakumar : య‌శ‌స్వి జైస్వాల్‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ వార్నింగ్..! తోటల్లో తిరిగితే ఏమ‌వుతుందో తెలుసుగా ?

న్యూయార్క్ అందాల‌ను య‌శ‌స్వి జైస్వాల్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

Suryakumar : య‌శ‌స్వి జైస్వాల్‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ వార్నింగ్..! తోటల్లో తిరిగితే ఏమ‌వుతుందో తెలుసుగా ?

Suryakumar takes hilarious jibe at Jaiswal reminds him of Rohit wrath

Suryakumar Yadav – Yashasvi Jaiswal : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. మ‌రో నాలుగు రోజుల్లో ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానుంది. ఈ మెగాటోర్నీ కోసం ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు అమెరికాకు చేరుకుంది. టీమ్ఇండియా త‌మ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడ‌నుంది. అంత‌క‌ముందే జూన్ 1 బంగ్లాదేశ్‌తో భార‌త్ వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది.

గ‌త కొన్నాళ్లుగా టీమ్ఇండియా టీ20గానీ, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌గానీ గెల‌వ‌లేదు. ఈ సారి ఎలాగైనా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వాల‌నే ప‌ట్టుద‌లతో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆట‌గాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అయితే.. ప్రాక్టీస్ అనంత‌రం కాసేపు స‌ర‌దాగా న్యూయార్క్ వీధుల్లో ఆట‌గాళ్లు చ‌క్క‌ర్లు కొడుతున్నారు. న్యూయార్క్ అందాల‌ను య‌శ‌స్వి జైస్వాల్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

Rinku Singh : మిచెల్ స్టార్క్‌కు 24.75కోట్లు.. మీకు రూ.55లక్షలేనా?.. రింకూ అదిరిపోయే సమాధానం

ఈ ఫోటోల‌పై టీ20క్రికెట్‌లో ప్ర‌పంచ‌నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు, టీమ్ఇండియా స్టార్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ స్పందించాడు. రోహిత్ శ‌ర్మ యొక్క కోపాన్ని అత‌డికి గుర్తు చేశాడు. ‘జాగ్ర‌త్త‌.. తోట్ల‌ల్లో తిరిగితే ఏమ‌వుతుందో తెలుసుగా?’ అంటూ న‌వ్వుతున్న ఎమోజీని జ‌త చేశాడు.

ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టు సంద‌ర్భంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టీమ్ఇండియా ప్లేయ‌ర్ల‌ను కాస్త మంద‌లించాడు. మైదానంలో అల‌స‌త్వం వ‌దిలివేయాల‌ని అల్ట‌ర్‌గా ఉండాల‌ని సూచించాడు. ‘తోట‌ల్లో తిరుగుతున్న‌ట్లు తెలిస్తే..’ అంటూ మండిప‌డ్డాడు. రోహిత్ మాట్లాడిన మాట‌లు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ఈ మాటలు వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

తుది జ‌ట్టులో జైస్వాల్‌కు చోటు ఉంటుందా..?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన 15 మంది బృందంలో య‌శ‌స్వి జైస్వాల్ ఒక‌డు. ఈ యువ ఓపెన‌ర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత‌డికి తుది జ‌ట్టులో చోటు ఉంటుందో లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఐపీఎల్‌లో కోహ్లి ఓపెన‌ర్‌గా అద్భుతంగా రాణించాడు. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి విరాట్ కోహ్లి ఓపెనర్‌గా రావాల‌ని మాజీలు సూచిస్తున్నారు. మ‌రీ టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి మ‌రీ.

నేను వచ్చేశా..! టీమిండియా సభ్యులతో ప్రాక్టీస్ సెష‌న్‌లో హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్

 

View this post on Instagram

 

A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28)