×
Ad

Babar Azam : బాబర్ ఆజామ్‌కు ఐసీసీ షాక్‌.. దెబ్బ‌కు సెంచ‌రీ మ‌త్తు వ‌దిలింది..!

పాకిస్తాన్ స్టార్ ఆట‌గాడు, మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్‌కు (Babar Azam) ఐసీసీ షాకిచ్చింది.

Babar Azam has been handed a hefty fine for abuse of cricket equipment in the 3rd ODI against Sri Lanka

Babar Azam : పాకిస్తాన్ స్టార్ ఆట‌గాడు, మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్‌కు ఐసీసీ షాకిచ్చింది. అత‌డి మ్యాచ్ ఫీజులో 10 శాతం జ‌రిమానాగా విధించింది. అంతేకాదండోయ్ అత‌డి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.

న‌వంబ‌ర్ 16న శ్రీలంక‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ ఆజామ్ (Babar Azam) 34 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద ఔట్ అయ్యాడు. దీంతో తీవ్ర అస‌హ‌నానికి లోనైన అత‌డు వికెట్ల‌ను కాలితో త‌న్నాడు. ఈ ఘ‌ట‌న‌పై ఐసీసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

IND vs SA : గిల్ దూరం అయితే.. సాయి సుద‌ర్శ‌న్‌, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ వ‌ద్దు.. ఇత‌డిని తీసుకోండి..

‘బాబ‌ర్ చ‌ర్య‌ ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంది. ఆర్టిక‌ల్ 2.2 ప్ర‌కారం అంత‌ర్జాతీయ మ్యాచ్ స‌మ‌యంలో క్రికెట్ ప‌రిక‌రాలు లేదా దుస్తులు లేదా గ్రౌండ్ ప‌రిక‌రాలు, ఫిట్టింగ్‌ల‌ను ధ్వంసం చేయ‌డం లేదా, దుర్వినియోగం చేయ‌డం నేరం. దీని ప్ర‌కారం బాబ‌ర్ డిసిప్లినరీ రికార్డుకు ఓ డీ మెరిట్‌ పాయింట్ జ‌త‌ చేయబడింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం జ‌రిమానాగా విధించాం. గ‌డిచిన 24 నెల‌ల కాలంలో బాబ‌ర్ చేసిన మొద‌టి నేరం ఇదే. చేసిన త‌ప్పును, వేసిన శిక్ష‌ను అత‌డు అంగీక‌రించాడు. దీంతో దీనిపై ఎలాంటి త‌దుప‌రి విచార‌ణ ఉండ‌దు.’ అని ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

కాగా.. ఆ మ్యాచ్‌కు ముందే బాబర్‌ తన సెంచ‌రీ క‌రువు తీర్చుకున్నాడు. రెండో వ‌న్డే మ్యాచ్‌లో అత‌డు 119 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 102 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 807 రోజులు, 83 మ్యాచ్‌ల త‌రువాత అత‌డికి ఇదే తొలి సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. సెంచ‌రీ చేసిన ఆనందంలో ఉండ‌గానే ఐసీసీ షాక్ ఇచ్చింది.

NZ vs WI : న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..

ఇదిలా ఉంటే.. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్తాన్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.