Babar Azam : చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజామ్ (Babar Azam) చరిత్ర సృష్టించాడు.
- Thota Vamshi Kumar
- Published On : February 2, 2026 / 10:12 AM IST
Babar Azam SURPASSES Virat Kohli TO REACH MAJOR T20I MILESTONE
Babar Azam : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీని అధిగమించాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 38 అర్థశతకాలు సాధించాడు. తాజాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో అర్థశతకం బాబర్‌కు 39వ హాఫ్ సెంచరీ. ఇక ఈ జాబితాలో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లు సైతం ఉన్నారు.
ICC : భారత్‌తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే .. అలా చేస్తే..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..
* బాబర్ ఆజామ్ (పాకిస్తాన్) – 39 అర్థశతకాలు
* విరాట్ కోహ్లీ (భారత్) – 38 అర్థశతకాలు
* రోహిత్ శర్మ (భారత్) – 32 అర్థశతకాలు
* మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) – 30 అర్థశతకాలు
* డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 28 అర్థశతకాలు
ఇక ఆసీస్, పాకిస్తాన్ మూడో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్ (56; 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజామ్ (50నాటౌట్ ; 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. ఆఖరిలో షాదాబ్ ఖాన్ (46; 19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) వేగంగా ఆడాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ రెండు వికెట్లు పడగొట్టాడు.
WPL 2026 : యూపీపై విజయం.. ఎలిమినేటర్‌కు ఢిల్లీ.. టోర్నీ నుంచి ముంబై ఔట్
ఆ తరువాత 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ జట్టు 16.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ 111 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (22), మార్కస్ స్టోయినిస్ (23), జోష్ ఫిలిప్ (14) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ ఐదు వికెట్లు తీశాడు. షాహీన్ షా అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ విజయంతో పాక్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
