Rohit Sharma : రోహిత్ శర్మకు బిగ్‌షాక్.. ప్రపంచ‌కప్ జట్టులో చాన్స్ కష్టమే.. ఇక ఆరు మ్యాచ్‌లే.. లాస్ట్ వన్డే అదే అవుతుందా?

Rohit Sharma : 2027 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు స్వదేశంలో శ్రీలంక, జింబాబ్వేలతో కలిపి ఆరు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఐపీఎల్ కారణంగా సుదీర్ఘ విరామం ఉంటుంది. ఈ ఆరు మ్యాచ్‌లు రోహిత్‌ శర్మ తన ఫామ్‌ను నిరూపించుకునేందుకు కీలకం కానున్నాయి. అవసరమైతే విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడే అవకాశం ఉంది.

Rohit Sharma

Rohit Sharma : టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు బిగ్ షాకిచ్చేందుకు సెలెక్టర్లు సిద్ధమవుతున్నారా..? 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో ఆడాలనే ఆయన ఆశలకు అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభమయ్యాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆయన భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మొదలైంది.

Also Read : Jay Shah : ప్రపంచ క్రికెట్‌లో జై షా హవా.. ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి ఎన్నిక! నెక్ట్స్ టార్గెట్ ఇదే..!

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ పూర్తిగా నిరాశపరిచాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 23 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్ పిచ్‌లపై బంతి స్వింగ్, బౌన్స్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డాడు. దీంతో వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న ప్రపంచకప్‌లో ఆయన ప్రదర్శన ఎలా ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చేఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కు ముందే రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతుంది.

అజిత్ అగార్కర్ తరువాత టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, రోహిత్‌ శర్మ, ఓజాకు మంచి సంబంధాలు ఉన్నాయి. జూనియర్ క్రికెట్ రోజుల నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. గతంలో మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సూచన మేరకు ప్రజ్ఞాన్ ఓజా.. రోహిత్‌ శర్మతో అతడి రిటైర్మెంట్ అంశంపై మాట్లాడినట్లు సమాచారం. అయితే, ఆ ప్రతిపాదనపై రోహిత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనాలు వెల్లడించాయి. ఇప్పుడు అగార్కర్ స్థానంలో ఓజా బాధ్యతలు చేపట్టడంతో మరోసారి రోహిత్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది.

2027 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు స్వదేశంలో శ్రీలంక, జింబాబ్వేలతో కలిపి ఆరు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఐపీఎల్ కారణంగా సుదీర్ఘ విరామం ఉంటుంది. ఈ ఆరు మ్యాచ్‌లు రోహిత్‌ శర్మ తన ఫామ్‌ను నిరూపించుకునేందుకు కీలకం కానున్నాయి. అవసరమైతే విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడే అవకాశం ఉంది.

దాదాపు రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌కు సేవలందిస్తున్న రోహిత్ శర్మ 2027లో జరిగే ప్రపంచకప్‌‌లో ఆడాలనే ఆసక్తితో ఉన్నాడు. ఆ తరువాత వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నాడు. అయితే, ఆయన ప్రస్తుత ఫామ్, వయసు, దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆడగల సామర్థ్యాన్ని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రోహిత్‌తో ప్రజ్ఞాన్ ఓజా నేరుగా చర్చించి భవిష్యత్తుపై స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ ప్రముఖులు సూచిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. వచ్చే ఏడాది జింబాబ్వేతో జరిగే చివరి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఒకవేళ రోహిత్‌కు ప్రపంచకప్‌లో చోటు దక్కకపోతే, ఆయన సొంత మైదానంలో జరిగే ఆ మ్యాచ్ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.