BAN vs PAK : బంగ్లా కుర్రాడి దెబ్బ‌కు కుప్ప‌కూలిన పాకిస్థాన్.. తొలి వ‌న్డేలో 114 ఆలౌట్‌..

ఢాకా వేదిక‌గా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే (BAN vs PAK) మ్యాచ్ జ‌రుగుతోంది.

BAN vs PAK 1st ODI Pakistan all out 114

  • ఢాకా వేదిక‌గా పాక్‌, బంగ్లా మ‌ధ్య తొలి వ‌న్డే
  • 114 ప‌రుగుల‌కే పాక్ ఆలౌట్‌
  • బంగ్లా ముందు స్వ‌ల్ప ల‌క్ష్యం

BAN vs PAK : మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఢాకా వేదిక‌గా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌల‌ర్ల ధాటికి పాకిస్థాన్ 30.4 ఓవ‌ర్ల‌లో 114 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 115 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. బంగ్లా బౌల‌ర్ల‌లో న‌హిద్ రాణా 5 వికెట్లు తీశాడు. మెహిది హసన్ మీరాజ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ సాధించారు.

Virat Kohli : ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన కోహ్లీ.. కింగ్ మొద‌లెట్టేశాడు.. ఇక బౌల‌ర్లకు కాళ‌రాత్రులే..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెన‌ర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (27; 38 బంతుల్లో 4 ఫోర్లు), మాజ్ సదఖత్ (18; 28 బంతుల్లో 3 ఫోర్లు) తొలి వికెట్ కు 41 ప‌రుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. అయితే.. బంగ్లా న‌యా పేస్ సంచ‌ల‌నం నహిద్ రాణా విజృంభించ‌డంతో పాక్ బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఓపెన‌ర్లు ఇద్ద‌రితో పాటు షామిల్ హుస్సేన్ (4), మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (10), స‌ల్మాన్ అలీ అఘా (5) ల‌ను న‌హిద్ రాణా ఔట్ చేశాడు.

ICC T20I Rankings : టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సంజూ శాంస‌న్‌, ఇషాన్ కిష‌న్‌.. ప‌డిపోయిన సూర్య‌, తిల‌క్ ర్యాంక్స్‌

మ‌రో వైపు బంగ్లాదేశ్ వ‌న్డే కెప్టెన్ మెహిది హసన్ మీరాజ్.. హుస్సేన్ తలత్ (4), అబ్దుల్ సమద్ (0), పాకిస్థాన్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది (4) ల‌ను పెవియ‌న్‌కు చేర్చాడు. దీంతో పాకిస్థాన్ 82 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. క‌నీసం ఆ జ‌ట్టు స్కోరు 100 అయినా దాటుతుందా? అని అనిపించింది.

అయితే.. ఆఖ‌రిలో ఫహీం అష్రఫ్ (37; 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించ‌డంతో పాకిస్థాన్ వంద ప‌రుగులు దాటింది.