BAN vs AUS : ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచ‌ల‌న విజ‌యం.. 36 ఏళ్ల చ‌రిత్ర‌లో ఇది రెండోసారి..

మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఢాకా వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో (BAN vs AUS) బంగ్లాదేశ్ డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 86 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

Bangladesh win by 86 runs DLS method 1st ODI against Australia

  • తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యం
  • డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో
  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి

BAN vs AUS : వ‌న్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఢాకా వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 86 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 284 ప‌రుగులు చేసింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో మొసాద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్; 70 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), నజ్ముల్ హుస్సేన్ శాంటో (67; 86 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), తన్జిద్ హసన్ తమీమ్ (54; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీడు. లియామ్ స్కాట్, మాట్ రెన్‌షా లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. జేవియర్ బార్ట్‌లెట్ ఓ వికెట్ సాధించాడు.

Team India : ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించ‌నున్న భార‌త‌ టీ20 జ‌ట్టులో మార్పులు.. సిరాజ్ ఔట్, ప్రసిద్ధ్ ఇన్‌..


285 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్ 42.2 ఓవ‌ర్ల‌లో 191/9 స్కోరు వ‌ద్ద ఉండ‌గా వ‌ర్షం మొద‌లైంది. కొద్ది సేపు చూసిన అంపైర్లు వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో బంగ్లాదేశ్ విజ‌యం సాధించిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో కామెరూన్ గ్రీన్ (52 నాటౌట్; 66 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. అలెక్స్ కేరీ (47; 62 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో నహిద్ రాణా నాలుగు వికెట్లు సాధించాడు. ముస్తాఫిజుర్ రెహమాన్, మొసద్దెక్ హుస్సేన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. టాస్కిన్ అహ్మద్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Bizarre Run Out : క్రికెట్ చరిత్రలోనే వింత రనౌట్.. కీపర్ కాలు కింద బ్యాట్! థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్!

కాగా.. ఆసీస్ పై బంగ్లాదేశ్ వ‌న్డేల్లో గెల‌వ‌డం ఇది రెండో సారి మాత్ర‌మే. గ‌తంలో 2005లో కార్డిఫ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో తొలిసారి ఆసీస్‌కు బంగ్లా షాకిచ్చింది.