BAN vs PAK : వ‌న్డే క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. తొలి వ‌న్డేలో పాక్ పై బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యం

తొలి వ‌న్డేలో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ (BAN vs PAK) ఘ‌న విజ‌యం సాధించింది.

Bangladesh won by 8 wickets against Pakistan in1st ODI

  • తొలి వ‌న్డేలో పాక్ పై బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యం
  • 115 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15.2 ఓవ‌ర్ల‌లో ఛేద‌న‌
  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి

BAN vs PAK : బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు సంచ‌ల‌న విజ‌యం సాధించింది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఢాకా వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

115 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15.1 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో తంజిద్ హసన్ తమీమ్ (67 నాటౌట్; 42 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాప్ సెంచ‌రీ చేశాడు. నజ్ముల్ హుస్సేన్ శాంటో (27; 33 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. పాక్ బౌల‌ర్ల‌లో షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

ICC T20I Rankings : టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సంజూ శాంస‌న్‌, ఇషాన్ కిష‌న్‌.. ప‌డిపోయిన సూర్య‌, తిల‌క్ ర్యాంక్స్‌

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 30.4 ఓవ‌ర్ల‌లో 114 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పాక్ బ్యాట‌ర్ల‌లో ఫహీం అష్రఫ్ (37; 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), సాహిబ్జాదా ఫర్హాన్ (27; 38 బంతుల్లో 4 ఫోర్లు) లు రాణించారు. మాజ్ సదఖత్ (18), మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (10) లు రెండు అంకెల స్కోరు చేయ‌గా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. బంగ్లా బౌల‌ర్ల‌లో న‌హిద్ రాణా ఐదు వికెట్లతో పాక్ వెన్ను విరిచాడు. మెహిది హసన్ మీరాజ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ సాధించారు.

Virat Kohli : ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన కోహ్లీ.. కింగ్ మొద‌లెట్టేశాడు.. ఇక బౌల‌ర్లకు కాళ‌రాత్రులే..

ఈ విజ‌యంతో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో బంగ్లా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.