IND vs SL : శ్రేయ‌స్ అయ్య‌ర్‌, దూబెలు ఔట్ అయ్యారంటే అర్థం ఉంది.. కోహ్లీ ఇలా ఔట్ అవుతున్నాడంటే..?

ప‌రుగుల యంత్రం, రికార్డుల‌ రారాజు విరాట్ కోహ్లీ శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో విఫ‌లం అవుతున్నాడు.

Basit Ali exposes Virat Kohli tells the world his struggles against spin

IND vs SL – Virat Kohli : ప‌రుగుల యంత్రం, రికార్డుల‌ రారాజు విరాట్ కోహ్లీ శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో విఫ‌లం అవుతున్నాడు. ఆడిన రెండు వ‌న్డేల్లో త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. రెండు మ్యాచుల్లో క‌లిపి 38 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. రెండు సార్లు కూడా స్పిన్న‌ర్ల‌కే త‌న వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నాడు. రెండుసార్లు ఎల్భీగానే ఔట్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో కోహ్లీ విఫ‌లం అవ్వడానికి గ‌ల కార‌ణాల‌ను పాకిస్తాన్ మాజీ ఆట‌గాడు బ‌సిత్ అలీ వెల్ల‌డించాడు. స‌రైన మ్యాచ్ ప్రాక్టీస్ లేక‌నే విఫ‌లం అవుతున్నాడ‌ని చెప్పాడు.

త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో మాట్లాడుతూ.. కోహ్లీ వైఫ‌ల్యంపై స్పందించాడు బ‌సిత్ అలీ. కోహ్లీ ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్‌. ఇలాంటి ఆట‌గాడు వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో ఎల్భీగా ఔట్ అయ్యాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ లేకుంటే శివ‌మ్ దూబెలు ఇలా ఔట్ అయ్యారు అంటే ఓ అర్థం ఉంది. కానీ ఓ గొప్ప ఆట‌గాడు అయిన కోహ్లీ ఇలా ఔట్ కావ‌డం మాత్రం ఆశ్చ‌ర్యానికి గురి చేసిందన్నాడు.

Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో అద‌ర‌గొట్టిన నీర‌జ్ చోప్రా.. ప‌త‌కానికి అడుగు దూరంలో

ఇక స‌రైన ప్రాక్టీస్ లేక‌పోవ‌డంతోనే కోహ్లీ విఫ‌లం అవుతున్నాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇక భార‌త బ్యాటింగ్‌ను చూస్తుంటే ఈ జ‌ట్టేనా ప్ర‌పంచ క్రికెట్‌ను శాసించింద‌నే అనుమానం క‌లుగుతుంద‌న్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్ లు కూడా తగినంత ప్రాక్టీస్‌ చేసినట్లుగా క‌న‌బ‌డ‌డం లేద‌న్నాడు. డైరెక్టుగా మ్యాచ్‌ ఆడటానికి వచ్చేసినట్లుగా ఉంద‌న్నాడు. అయ్య‌ర్ స్థానంలో రిష‌బ్ పంత్ లేదా రియాన్ ప‌రాగ్, రింకూ సింగ్‌ల‌ను జ‌ట్టులోకి తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింద‌న్నాడు.

మిడిల్ ఆర్డ‌ర్ త‌డ‌బ‌డ‌డంతో తొలి వ‌న్డేను టైగా ముగించిన భార‌త్ రెండో వ‌న్డేలో ఓట‌మి పాలైంది. ఇక కీల‌క‌మైన మూడో వ‌న్డే బుధ‌వారం జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భార‌త్ భావిస్తోంది. అదే స‌మ‌యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాల‌ని లంక ప‌ట్టుద‌ల‌గా ఉంది.

Vinesh Phogat : వినేశ్ ఫోగ‌ట్ ప‌ట్టు అదిరింది.. ప‌త‌కానికి అడుగు దూరంలో..

ట్రెండింగ్ వార్తలు