రెండు ఐపీఎల్ టీంలకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్, జైషాకు మరో అత్యున్నత పదవి

bcci

బీసీసీఐ కొత్త ఐపీఎల్ టీంలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇండియాకు చెందిన ఐసీసీ రిప్రజంటేటివ్‌లతో పాటు ముగ్గురు కొత్త నేషనల్ సెలక్టర్లకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. దాంతో పాటు ఏజీఎమ్ హోల్డింగ్‌లో పెట్టి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక తర్వాత 23పాయింట్ల అజెండాకు ఓకే చెప్పింది. ఈ అప్రూవల్ తో ఐపీఎల్ లో చేరిన రెండు కొత్త జట్లతో కలిపి మొత్తంగా పది జట్లతో ఐపీఎల్ ఆడాలనేది ప్లాన్.

అదానీ గ్రూప్, సంజీవ్ గోయెంకాలు కొత్త టీంలను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. పదో టీంను కాన్పూర్, లక్నో లేదా పూణె నుంచి తీసుకోవాలనుకుంటున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్ 24న జరిగే స్టేట్ అసోసియేషన్స్ మీటింగ్ లో ఐపీఎల్ 2021కి సరిపడ కొత్త 2జట్లను ప్రపోజల్ లో పెడతారు.



మరో కీలక విషయం ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ లకు బీసీసీఐ ప్రతినిధి ఎవరనేదానిపై చర్చ జరగనుంది. దీనికి కీలకంగా అమిత్ షా కొడుకు ప్రస్తుత సెక్రటరీ జై షాను తీసుకునేటట్లు చర్చలు జరుగుతున్నాయి. ముగ్గురు కొత్త సెలక్టర్లతో పాటు సెలక్టర్ల చైర్మన్ ను కూడా అపాయింట్ ఇవ్వాలనుకుంటున్నారు.

క్రికెట్ కమిటీలో సెలక్షన్ కమిటీ అనేది ఓ పార్ట్ మాత్రమే. దాంతో పాటు టెక్నికల్ కమిటీ కూడా సమానంగా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ స్టాచ్యూరీ సబ్ కమిటీలని సీనియర్ బీసీసీఐ అధికారి అన్నారు.