BCCI : ఐపీఎల్ గ్రౌండ్స్‌మెన్‌కు రూ.1.25 కోట్ల నజరానా : బీసీసీఐ ప్రకటన

BCCI : ఐపీఎల్ ఉత్కంఠ భరింతగా సాగింది. ఐపీఎల్ 2022 టోర్నీ విజయవంతంగా ముగిసింది. తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగురవేసుకుపోయింది.

BCCI : ఐపీఎల్ ఉత్కంఠ భరింతగా సాగింది. ఐపీఎల్ 2022 టోర్నీ విజయవంతంగా ముగిసింది. తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగురవేసుకుపోయింది. కొత్త జట్టుగా అడుగుపెట్టి కప్పు కొట్టేసింది. ఐపీఎల్ ఫైనల్లో విజేతగా నిలిచిన సందర్భంగా మైదానంలో వేడుకలు జరిపారు. ఐపీఎల్ మ్యాచులు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ప్రతి మ్యాచ్ కు సంబంధించి వెనుకుండి నిర్వహించిన గ్రౌండ్స్ మెన్స్, క్యూరేటర్లకు బీసీసీఐ క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ ఏడాది కరోనా భయంతో ఐపీఎల్ మ్యాచులను కేవలం 6 మైదానాలకే పరిమితం చేయాల్సి వచ్చింది.

అందులో ఎక్కువగా జరిగిన మ్యాచ్‌లు.. ముంబై, పూణేలోని నాలుగు మైదానాల్లోనే లీగ్ దశలోని 70 మ్యాచులు నిర్వహించారు. ప్లేఆఫ్స్ కోసం ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోదీ స్టేడియాలను ఉపయోగించారు. ఇటీవలే ఈ మైదానాల గ్రౌండ్స్‌మెన్‌కు రూ.1.25 కోట్ల బహుమతి అందిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

Bcci Announces 1.25 Crore Prize Money For Ipl Curators And Groundsmen 


బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ మేరకు ట్వీట్ చేశారు. ఎంసీఏ, వాంఖడే, డీవై పాటిల్, సీసీఐ, పూణే స్టేడియాల్లో ఒక్కోదానికి రూ.25 లక్షల చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు షా వెల్లడించారు. ప్లేఆఫ్స్‌ నిర్వహించిన ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోదీ స్టేడియం నిర్వాహకులకు తలో రూ.12.5 లక్షల చొప్పున నజరానా ప్రకటించనున్నట్టు వెల్లడించారు.

Read Also : IPL 2022 : Gujarat Titans : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్‌ను సత్కరించిన సీఎం భూపేంద్రభాయ్

ట్రెండింగ్ వార్తలు