U19 World Cup: అండర్-19 టీం విన్నర్లకు బీసీసీఐ రూ.40 లక్షల రివార్డు

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ప్రతి ఒక్కరికీ రివార్డు ప్రకటించారు.

U-19 World Cup: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ప్రతి ఒక్కరికీ రివార్డు ప్రకటించారు. సర్ వివియన్ రిచర్డ్స్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇంగ్లీష్ జట్టుపై గెలిచిన టీంను సత్కరించనున్నారు. ఈ మేరకు జట్టులో ప్రతి ప్లేయర్ కు రూ.40లక్షలు ఇవ్వనుండగా సపోర్టింగ్ స్టాఫ్ కు రూ.25లక్షల చొప్పున అందజేయనున్నారు.

‘ఈ విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నా. టీంలో ప్రతి ప్లేయర్ కు రూ.40లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్ ఒకొక్కరికీ రూ.25లక్షల ఇవ్వనున్నారు. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా అత్యద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. దేశం గర్వించేలా చేశారు’ అని ట్వీట్ చేశారు జై షా.

మరో ట్వీట్ లో…”@ICC U19 వరల్డ్ కప్ గెలిచినందుకు అభినందనలు. ఇది చాలా ప్రత్యేకమైన @VVSLaxman281 అన్ని అసమానతలపై విజయం. ఈ క్లిష్ట సమయాల్లో ప్రతి ఒక్కరూ చరిత్ర సృష్టించడానికి అవసరమైన స్వభావాన్ని కనబరిచారు. #INDvENG #U19CWCFinal’ అంటూ పోస్టు పెట్టారు.

యశ్ ధుల్ కెప్టెన్సీలో అండర్-19 జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని ముద్దాడింది. ఫలితంగా 2000, 2008, 2012, 2018లతో పాటు 2022లోనూ అండర్-19 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.

ఇదే విషయాన్ని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ పోస్టు చేస్తూ…’ఇది అండర్-19 జట్టు అద్భుతమైన ప్రదర్శనకు నిదర్శనం. టోర్నమెంట్ ఆసాంతం చక్కటి ప్రదర్శనను కనబరిచింది. రాజంగద్ బావా, రవి కుమార్, షేక్ రషీద్, నిషాంత్ సింధూలు బాగా ఆడారు’ అని పోస్టు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు