Team India : దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టీ20, టెస్టు, వన్డే జట్ల ప్రకటన .. టెస్టులకే పరిమితమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
Team India squad : దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించారు
- Thota Vamshi Kumar
- Updated on- November 30, 2023 / 08:29 PM IST
Team India squad
దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి విశ్రాంతి కోరుకున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలిపింది. దీంతో వీరిద్దరిని వన్డేలు, టీ20లకు పరిగణలోకి తీసుకోలేదు. టెస్టులకు మాత్రం ఎంపిక చేసింది. ఇప్పటికే వీరిద్దరు గత ఏడాదిగా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటుండగా వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం వన్డేలు సైతం ఆడరని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరు కేవలం టెస్టు జట్టుకు మాత్రమే ఎంపిక కావడం గమనార్హం.
ఇక టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. టెస్టులకు యధావిధిగా రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించన్నాడు. వన్డే జట్టులోకి సంజు శాంసన్ రీ ఎంట్రీ ఇవ్వగా, రజత్ పటీదార్ చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.
వన్డేలకు భారత జట్టు ఇదే : రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్.
టీ20లకు భారత జట్టు ఇదే : యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్‌కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్
టెస్టులకు భారత జట్టు ఇదే : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొనే 20 జట్లు ఇవే.. జాబితాను ప్రకటించిన ఐసీసీ
