T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాల్గొనే 20 జ‌ట్లు ఇవే.. జాబితాను ప్ర‌క‌టించిన ఐసీసీ

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాల్గొనున్న 20 జ‌ట్ల వివ‌రాల‌ను ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించింది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాల్గొనే 20 జ‌ట్లు ఇవే.. జాబితాను ప్ర‌క‌టించిన ఐసీసీ

ICC T20 World Cup 2024

ICC T20 World Cup 2024 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ స‌మరం ముగిసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 పై ప‌డింది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. యూఎస్‌, వెస్టిండీస్ జట్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను ఆయా దేశాలు మొద‌లెట్టాయి. 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈ సారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ మెగాటోర్నీలో పాల్గొనే 20 జ‌ట్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

ఏ ప్ర‌తిపాదిన జ‌ట్ల ఎంపిక జ‌రిగిందంటే..?

ఐసీసీ 12 జ‌ట్ల‌కు నేరుగా అర్హ‌త క‌ల్పించింది. అది ఎలాగంటే.. గ‌త టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టాప్‌-8లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్ల‌ల‌తో పాటు అతిథ్య హోదాలో యూఎస్‌, వెస్టిండీస్ ల‌తో క‌లిపి మొత్తం 10 జ‌ట్లు నేరుగా అర్హ‌త పొందాయి. అంతేకాకుండా టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, ప‌ది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా డైరెక్టుగా అర్హ‌త సాధించాయి.

IPL 2024 Retention Wrap : ఫ్రాంచైజీలు వ‌దిలి పెట్టిన ఆట‌గాళ్లు వీరే.. ఏ జ‌ట్టు వ‌ద్ద ఎంత న‌గ‌దు ఉందంటే..?

మిగిలిన 8 స్థానాల కోసం రీజియ‌న్ల వారీగా క్వాలిఫ‌యింగ్ పోటీల‌ను నిర్వ‌హించారు. అమెరియ‌న్ క్వాలిఫ‌య‌ర్ విన్న‌ర్‌గా నిలిచిన కెన‌డా, ఏసియా క్వాలిఫ‌య‌ర్ ఫైన‌ల్‌కు చేరుకున్న నేపాల్‌, ఒమ‌న్‌, ఈస్ట్ ఆసియా-ఫ‌సిఫిక్ క్వాలిఫ‌య‌ర్ విజేత ప‌పువా న్యూ గినియా, యూరోపియ‌న్ క్వాలిఫ‌య‌ర్ ఫైన‌ల్‌కు చేరుకున్న ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఆఫ్రికా క్వాలిఫ‌య‌ర్ పైనల్‌కు చేరుకున్న ఉగాండ‌, న‌బీబియాలు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించాయి,.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే జ‌ట్లు ఇవే..

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్, యూఎస్‌, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌, కెన‌డా, నేపాల్‌, ఒమ‌న్‌, ప‌పువా న్యూ గినియా, ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఉగాండ‌, న‌బీబియా

20 జ‌ట్లతో టోర్నీ ఎలా జ‌ర‌గ‌నుందంటే..?

మొత్తం 20 జ‌ట్ల‌ను నాలుగు గ్రూపులుగా విభ‌జించ‌నున్నారు. ఒక్కొ గ్రూపులో 5 జ‌ట్లు ఉంటాయి. ప్ర‌తీ గ్రూపులో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్‌-8లోకి ప్ర‌వేశిస్తాయి. అక్క‌డ 8 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జిస్తారు. ప్ర‌తీ గ్రూపులో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు సెమీ పైన‌ల్‌కు చేరుకుంటాయి. సెమీ ఫైన‌ల్‌లో విజేత‌లుగా నిలిచిన జ‌ట్లు ఫైన‌ల్ మ్యాచ్‌లో క‌ప్పు కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Bowler Bizarre Action : విచిత్ర‌మైన బౌలింగ్ యాక్ష‌న్‌.. అయోమ‌యంలో బ్యాట‌ర్‌.. ఎక్క‌డ ఉన్నావ్ బాసూ..!