Prabhas: ప్రభాస్ నిజంగా బంగారం.. మరో ఛాన్స్ ఇచ్చాడట
ఫ్లాప్ ఇచ్చిన నిర్మాతకు మరో అవకాశాలు ఇచ్చిన ప్రభాస్(Prabhas).
prabhas doing one more movie in people media factory
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేమ్ లోనే కాదు వ్యక్తిత్వంలో కూడా చాలా గొప్ప వ్యక్తి అని చాలా మంది చెప్తూనే ఉంటారు. ఆ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది కూడా. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ప్రభాస్. ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ది రాజసాబ్. హారర్ అండ్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల అయ్యింది.
భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాల విషయంలో ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ ని కాదు కనీసం ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ను కూడా శాటిస్ఫై అవలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, సినిమా డిజాస్టర్ అవడంతో ఆయనకు భారీ నష్టాలు వచ్చాయని సమాచారం.
Maa Inti Bangaram: సమ్మర్ లో సమంత యాక్షన్.. మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
ఆ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడట. ఇటీవల టీజీ విశ్వప్రసాద్ ప్రభాస్ ని కలువగా ఆయనతో ఈ మాట చెప్పాడట. దీంతో, నిర్మాత ఆనందం వ్యక్తం చేస్తున్నాడని సమాచారం. తన వల్ల నష్టపోయిన వారి కోసం నిలబడటం ప్రభాస్ కు ముందు నుంచి ఉన్న అలవాటే. ఇక ప్రభాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చేయబోతున్న ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది అని తెలుస్తోంది.
అయితే, ఈ ప్రాజెక్టును ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, ఈసారి మాత్రం ప్రభాస్ రేంజ్ ని పాన్ ఇండియా లెవల్లో పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసే దర్శకుడు, ఆ రేంజ్ కథతోనే ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడట టీజీ విశ్వప్రసాద్. కాబట్టి, ఈసారి వీరి కాంబోలో రాబోయే మూవీ మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇక ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు హను రాభవపూడితో ఫౌజీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈఏడాది ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
