Bowler Bizarre Action : విచిత్ర‌మైన బౌలింగ్ యాక్ష‌న్‌.. అయోమ‌యంలో బ్యాట‌ర్‌.. ఎక్క‌డ ఉన్నావ్ బాసూ..!

Bowler Bizarre Action video :చాలా మంది బౌల‌ర్లు ఒకే ర‌క‌మైన బౌలింగ్ యాక్ష‌న్ ను క‌లిగి ఉన్నారు. అయితే.. ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌, ల‌సిత్ మ‌లింగ లాంటి కొంద‌రు మాత్రం అసాధార‌ణ‌మైన శైలిని క‌లిగి ఉంటారు.

Bowler Bizarre Action : విచిత్ర‌మైన బౌలింగ్ యాక్ష‌న్‌.. అయోమ‌యంలో బ్యాట‌ర్‌.. ఎక్క‌డ ఉన్నావ్ బాసూ..!

Bowler Bizarre Action

క్రికెట్‌లో ఎంద‌రో దిగ్గ‌జ బౌల‌ర్లు ఉన్నారు. చాలా మంది బౌల‌ర్లు ఒకే ర‌క‌మైన బౌలింగ్ యాక్ష‌న్ ను క‌లిగి ఉంటారు. అయితే.. ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌, ల‌సిత్ మ‌లింగ లాంటి కొంద‌రు మాత్రం అసాధార‌ణ‌మైన శైలిని క‌లిగి ఉన్నారు. వారి కండ‌రాల క‌ద‌లిక‌ల వ‌ల్లే వారు విభిన్న శైలిని క‌లిగి ఉన్నారు. ఇందులో ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బౌలింగ్ శైలి స‌రిగా లేద‌ని ఆస్ట్రేలియా వంటి జ‌ట్లు ప‌లుమార్లు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదులు సైతం చేశాయి. ఐసీసీ ప‌రీక్ష‌ల్లో తాను ఎలాంటి నిబంధ‌న‌లు ఉల్ల‌ఘించ‌లేద‌ని ముర‌ళీధ‌ర‌న్ నిరూపించుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ వీడియో క్లిప్ వైర‌ల్‌గా మారింది. ఓ క్ల‌బ్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో అది. ఇందులో బౌల‌ర్ త‌న విచిత్ర‌మైన బౌలింగ్ శైలితో బ్యాట‌ర్‌ను అయోమ‌యానికి గురి చేశాడు. వీడియోలో ఏముందంటంటే.. ఆఫ్ స్పిన్న‌ర్ అయిన అత‌డు బౌలింగ్ చేయ‌డానికి ముందు త‌న చేతుల‌ను చాలా సార్లు తిప్ప‌డం చేశాడు. అత‌డి విచిత్ర‌మైన బౌలింగ్ యాక్ష‌న్ ను చూసిన బ్యాట‌ర్.. బౌల‌ర్ బంతిని వేయ‌క‌ముందే ప‌క్క‌కు త‌ప్పుకున్నాడు.

Sanju Samson : అనుకున్నదానికన్నా ఎక్కువే సాధించాను.. నేనేమీ దురదృష్టవంతుడిని కాదు.. సంజూ శాంసన్

మీరు స్విమ్మర్ కావాల‌ని అనుకోగా మీ త‌ల్లిదండ్రులు బ‌ల‌వంతంగా మిమ్మ‌ల్ని క్రికెట్‌లో చేర‌మ‌ని బ‌ల‌వంతం చేయ‌డంతో అంటూ ఓ నెటీజ‌న్ ఈ వీడియోను షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆన్ లూప్ అని ఓ వినియోగ‌దారుడు అన‌గా కాదు.. హ‌ర్భ‌జ‌న్ సింగ్ 5.0 అంటూ మ‌రొక‌రు అన్నారు. కాగా.. భార‌త మాజీ ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ బౌలింగ్ శైలికి కాస్త ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతోనే నెటీజ‌న్లు ఈ కామెంట్లు చేస్తున్నారు.

India Vs Australia T20 Match : రింకూ సింగ్ లాస్ట్ బాల్ లో కొట్టిన సిక్స్ ఎందుకు స్కోర్ బోర్డులోకి రాలేదు.. అసలు విషయం ఏమిటంటే?