Sanju Samson : అనుకున్నదానికన్నా ఎక్కువే సాధించాను.. నేనేమీ దురదృష్టవంతుడిని కాదు.. సంజూ శాంసన్

Sanju Samson : భారత వికెట్ కీపింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ తాను అనుకున్నదానికంటే చాలా ఎక్కువ సాధించానని అంటున్నాడు. తనపై 'అన్ లక్కీ క్రికెటర్' అనే ట్యాగ్‌ను తీసేయండని అభిమానులకు సూచించాడు.

Sanju Samson : అనుకున్నదానికన్నా ఎక్కువే సాధించాను.. నేనేమీ దురదృష్టవంతుడిని కాదు.. సంజూ శాంసన్

Sanju Samson plays down 'unluckiest cricketer' tag following World Cup snub

Sanju Samson : టీమిండియా క్రికెటర్లలో అతడో అద్భుతమైన ఆటగాడు. కానీ, అవకాశాలే అతన్ని ఎప్పుడూ ఎగతాళి చేస్తుంటాయి. పేరుకు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ఆట ఆడేందుకు ఎవరూ అవకాశం ఇవ్వలేదు. దాంతో అతగాడికి దురదృష్టవంతుడు అనే ట్యాగ్ పడింది. అతడు ఎవరో కాదు.. భారత వికెట్ కీపింగ్ బ్యాటర్ సంజూ శాంసన్.. భారత జట్టులో చోటు దక్కాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు.. రవ్వంత కొంచెం అదృష్టం కూడా ఉండాలని అంటారు. ఆ విషయంలో సంజూను ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతోంది.

Sanju Samson plays down 'unluckiest cricketer' tag following World Cup snub

Sanju Samson

ఆసియా కప్ నుంచి వన్డే ప్రపంచ కప్ వరకూ సంజూకి ఏ సిరీస్‌లోనూ బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు. భారత జట్టులో చోటు కోసం ఆశించిన ప్రతిసారికి అతడికి నిరాశే ఎదురైంది. చివరికి, టీమిండియా 15 మంది సభ్యుల వన్డే ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేస్తున్నప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ సంజూను పట్టించుకోలేదు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా శాంసన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ఆటతో మెప్పించాడు. 2015లో భారత జట్టులో వికెట్ కీపింగ్ బ్యాటర్ అరంగేట్రం చేసాడు. కానీ ఇప్పటివరకు 24 టీ20లు, 13 వన్డేలు మాత్రమే ఆడగలిగాడు.

Read Also : ODI World Cup 2023 : ఫైనల్లో టీమిండియా ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ వింత వ్యాఖ్యలు .. మండిపడుతున్న నెటిజన్లు ..

ఆ మ్యాచ్‌లలో శాంసన్ వరుసగా 374 పరుగులు, 390 పరుగులు మాత్రమే చేశాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌కు ముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడినప్పుడు శాంసన్ చివరిసారిగా భారత్ తరపున ఆడాడు. కానీ, జాతీయ జట్టులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఒకవేళ అవకాశం వచ్చినా ఏదైనా మ్యాచ్‌లో విఫలమైతే వెంటనే అవకాశాలు చేజారిపోతున్నాయి. దాంతో సంజూ వైపు సెలెక్టర్లు సైతం కన్నెత్తి కూడా చూడటం లేదు.

నాకు సపోర్టు చేసిన మొదటి వ్యక్తి రోహిత్ శర్మ : 

ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో చోటు దక్కపోవడంపై అభిమానులు సంజూకి అన్ లక్కీ క్రికెటర్ అనే ట్యాగ్ తగిలించారు. అయితే, ఇప్పుడు ఆ ట్యాగ్ తనకు సరికాదని సంజూ తెగేసి చెబుతున్నాడు. యూట్యూబ్ ఛానెల్‌లో ధన్య వర్మతో మాట్లాడుతూ.. తాను అనుకున్నదానికంటే చాలా ఎక్కువ సాధించానని అంటున్నాడు.

అభిమానులు నన్ను అన్ లక్కీ క్రికెటర్ అని పిలుస్తారని, కానీ తాను ప్రస్తుతం ఎక్కడికి చేరుకున్నానో తనకు తెలుసునని, తాను అనుకున్నదానికంటే చాలా ఎక్కువే సాధించానని శాంసన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2023 తర్వాత తనను సంప్రదించిన మొదటి వ్యక్తులలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒకడని వెల్లడించాడు.

Sanju Samson plays down 'unluckiest cricketer' tag following World Cup snub

Sanju Samson ‘unluckiest cricketer’ tag

‘నా వద్దకు వచ్చి మాట్లాడిన మొదటి వ్యక్తుల్లో రోహిత్ శర్మ ఒకరు.. నాతో హే సంజు.. నువ్వు ఐపీఎల్‌లో బాగా ఆడావు. కానీ, ముంబై ఇండియన్స్‌పై చాలా సిక్సర్లు కొట్టావు. నువ్వు బాగా బ్యాటింగ్ చేస్తావ్’ అంటూ భుజం తట్టి ప్రోత్సాహించడని ఈ సందర్భంగా శాంసన్ గుర్తు చేసుకున్నాడు. 29 ఏళ్ల కేరళ క్రికెటర్ 14 మ్యాచ్‌లలో 362 పరుగులు చేశాడు.

గత సీజన్‌లో 30.17 సగటుతో 153.39 వద్ద స్ట్రైకింగ్ చేశాడు. 2023 ఆసియా కప్ కోసం భారత జట్టులో శాంసన్ రిజర్వ్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఎంపికయ్యాడు. కానీ, ఏ మ్యాచ్‌లోనూ తనకు ఆడేందుకు పిలుపు రాలేదు. భారత్ ఫైనల్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి 8వ ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

Read Also : Shivraj Singh Chouhan: ఇండియా ప్రపంచకప్ ఓడిపోతే వారిద్దరూ సంతోషించారు