ODI World Cup 2027 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 కోసం.. 20 మంది పేర్ల‌తో లిస్ట్ రెడీ చేసిన బీసీసీఐ!

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 (ODI World Cup 2027) కు దాదాపు ఏడాదిన్న‌ర‌కు పైగా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికి కూడా బీసీసీఐ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

BCCI selectors already narrowed down 20 odd probables for ODI World Cup 2027

  • వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027కు దాదాపు ఏడాదిన్న‌ర‌కు పైగా స‌మ‌యం
  • ఈ మెగాటోర్నీ కోసం 20 మందితో ప్రాబ‌బుల్స్‌ను సిద్ధం చేసిన బీసీసీఐ
  • ఐపీఎల్ నుంచే వీరిపై న‌జ‌ర్‌

ODI World Cup 2027 : వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ నెల‌లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 జ‌ర‌గ‌నుంది. ఈ మెగాటోర్నీకి దాదాపు ఏడాదిన్న‌ర‌కు పైగా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికి కూడా బీసీసీఐ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ మెగాటోర్నీ కోసం ఇప్ప‌టికే 20 మంది స‌భ్యుల‌తో కూడిన ప్రాబ‌బుల్స్ లిస్ట్‌ను రెడీ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఐపీఎల్ 2026 నుంచి వీరి ఆట‌ను అటు సెల‌క్ట‌ర్ల‌తో పాటు ఇటు బీసీసీఐ పెద్ద‌లు కూడా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఎస్ఎస్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా , ప్రజ్ఞాన్ ఓఝాలతో కూడిన సెలక్షన్ ప్యానెల్ స్టేడియాన్ని సందర్శించడంతో పాటు, ఐపీఎల్ మ్యాచ్‌లను టెలివిజన్‌లో కూడా వీక్షిస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపిన‌ట్లు పీటీఐ వెల్ల‌డించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను సెల‌క్ట‌ర్లు గ‌మ‌నిస్తున్నారంటే దాని అర్థం.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2028, లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ కోసం కాదని.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోస‌మేని తెలిపింది.

Virat Kohli : కోహ్లీనే బోల్తా కొట్టించిన 36 ఏళ్ల స్వింగ్ సుల్తాన్‌.. ఆర్‌సీబీకి ఇక నువ్వే దిక్కుసామీ..

ప్ర‌తి సెల‌క్ట‌ర్ క‌నీసం ఒక్క మ్యాచ్ అయినా ప్ర‌త్య‌క్షంగా మైదానంలో వీక్షించాల‌ని, ఇలా అంద‌రూ సెల‌క్ట‌ర్లు క‌లిసి వారానికి ఐదు మ్యాచ్‌లు క‌వ‌ర్ అయ్యేలా చూడాల‌ని బీసీసీఐ ఆదేశించిన‌ట్లు పేర్కొంది. మోకాలి గాయంతో హ‌ర్షిత్ రాణా ఐపీఎల్ నుంచి త‌ప్పుకోగా.. జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, అర్ష్‌దీప్ సింగ్ వంటి పేస‌ర్ల ఆట‌తీరును సెల‌క్ట‌ర్లు నిశితంగా గ‌మ‌నించ‌నున్నారు.

అఫ్గాన్‌తో ఏకైక టెస్టు..

జూన్ 6 నుంచి 10 వ‌ర‌కు ముల్లన్‌పూర్ వేదిక‌గా భార‌త్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ టెస్టు మ్యాచ్ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భాగం కాదు. అయిన‌ప్ప‌టికి కూడా కీల‌క ఆట‌గాళ్లు అంద‌రూ ఈ మ్యాచ్‌లో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భాగంగా ఆగ‌స్టు నుంచి మార్చి మ‌ధ్య‌లో టీమ్ఇండియా తొమ్మిది టెస్టులు ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో అఫ్గాన్ టెస్టు ప్రాక్టీస్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని బీసీసీఐ భావిస్తోంది.