Bhuvneshwar Kumar: ఏ ఫార్మాట్ లో ఆడటానికైనా సిద్ధమే.. అసత్యాలు ఆపండి

టీమిండియా ఫేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇకపై టెస్టు క్రికెట్ ఆడడని వస్తున్న రూమర్లపై స్పందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరగనున్న ...

Bhuvneshwar Kumar: టీమిండియా ఫేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇకపై టెస్టు క్రికెట్ ఆడడని వస్తున్న రూమర్లపై స్పందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ బయల్దేరనుంది. ఈ మేరకు నాలుగు నెలల పర్యటనకు వెళ్లనున్న 20 స్క్వాడ్ రెడీ అవగా అందులో భువీ పేరు లేదు.

అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆడగల భువీ అటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే టీమిండియాకు 21టెస్టులలో ప్రాతినిధ్యం వహించాడు. దక్షిణాఫ్రికాతో 2018లో చివరి సారిగా ఆడాడు.

ఇక ఇంగ్లాండ్ జరిగే టెస్టు ఫాస్ట్ బౌలింగ్ కు బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ పేర్లు ఎంపికయ్యాయి. ప్రసిద్ధ్ కృష్ణా, ఆవేశ్ ఖాన్, అర్జన్ నాగ్వస్వల్లలను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు.

భువీ టెస్టు ఫార్మాట్‌లు ఆడడని.. వచ్చిన ప్రచారంపై స్పందించిన ఈ ఫేసర్.. ‘టెస్టు క్రికెట్‌లో ఆడేందుకు అనాసక్తి ప్రదర్శించినట్లు వార్తలు వచ్చాయి. అందుకే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. మూడు ఫార్మాట్లలోనూ ఆడేందుకు ఎప్పుడూ సిద్ధమే. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలు రాయకండి’ అని భువనేశ్వర్ కుమార్ సూచించాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కి ఆడిన భువీ.. గాయం కారణంగా కీలకమైన మ్యాచ్‌‌లకి దూరంగా ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు