Mohammed Shami : చీల‌మండ‌ల గాయం.. ప‌ని చేయ‌ని ఇంజెక్ష‌న్లు.. ఐపీఎల్ నుంచి ష‌మీ ఔట్‌..! కోలుకోవ‌డం క‌ష్ట‌మేనా?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్ ఆరంభానికి ముందే గుజ‌రాత్ టైటాన్స్‌కు పెద్ద షాక్ త‌గిలింది.

Mohammed Shami Ruled Out Of IPL 2024

Mohammed Shami Ruled Out Of IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్ ఆరంభానికి ముందే గుజ‌రాత్ టైటాన్స్‌కు పెద్ద షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు సీనియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్, టీమ్ఇండియా ఆట‌గాడు మ‌హ్మ‌ద్ ష‌మీ సీజ‌న్ మొత్తానికి దూరం కానున్నాడ‌ని ఆంగ్ల‌మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఎడ‌మ చీల‌మండ‌ల గాయం నుంచి ష‌మీ ఇంకా కోలుకోలేద‌ని స‌మాచారం. దీంతో అత‌డు శ‌స్త్ర‌చికిత్స చేయించుకునేందుకు త్వ‌ర‌లోనే యూకేకు వెళ్ల‌నున్నట్లు తెలుస్తోంది.

33 ఏళ్ల ష‌మీ చివ‌రి సారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా త‌రుపున బ‌రిలోకి దిగాడు. ఈ మెగాటోర్నీలో టీమ్ కాంబినేష‌న్‌లో భాగంగా మొద‌టి నాలుగు మ్యాచుల్లో అత‌డికి చోటు ద‌క్క‌లేదు. అయితే.. ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయ‌ప‌డ‌డంతో ష‌మీకి తుది జ‌ట్టులో చోటు ద‌క్కింది. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్న సీనియ‌ర్ పేస‌ర్.. 24 వికెట్ల‌తో లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు.

Yashasvi Jaiswal : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో య‌శ‌స్వి జైస్వాల్ దూకుడు.. కోహ్లి ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడ‌కున్నా..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడుతున్న స‌మ‌యంలోనే అత‌డి ఎడ‌మ చీల‌మండ‌లానికి గాయ‌మైంది. నొప్పిని భ‌రిస్తూనే మ్యాచులు ఆడాడు. ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. జ‌న‌వ‌రి చివ‌రి వారంలో అత‌డు లండ‌న్‌కు వెళ్లాడు. అక్క‌డ చీల‌మండ‌ల గాయానికి ఇంజెక్ష‌న్లు తీసుకున్నాడు. మూడు వారాల్లో కోలుకుంటాన‌ని, నెమ్మ‌దిగా ప‌రిగెత్తుతాన‌ని ష‌మీ చెప్పాడు. అయితే.. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆ ఇంజెక్ష‌న్లు ప‌ని చేయ‌లేదు.

దీంతో అత‌డు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ క్ర‌మంలో అత‌డు యూకే వెళ్లి శ‌స్త్ర‌చికిత్స చేయించుకోవాల‌ని భావిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు వ‌చ్చే నెల‌లో ఆరంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్‌కు దూరం అయ్యాడ‌ని రిపోర్టులు చెబుతున్నాయి. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆరంభం కానుంది.

గ‌తేడాది అత్యుత్త‌మంగా రాణించ‌డంతో ఇటీవ‌లే ష‌మీ ప్ర‌తిష్ఠాత్మ‌క అర్జున అవార్డు అందుకున్నాడు. రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో ప్రెసిడెంట్ ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును స్వీక‌రించాడు. టీమ్ఇండియా త‌రుపున ష‌మీ 64 టెస్టులు, 101 వ‌న్డేలు, 23 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 229 వికెట్లు, వ‌న్డేల్లో 195 వికెట్లు, టీ20ల్లో 24 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక ఐపీఎల్‌లో 110 మ్యాచులు ఆడిన ష‌మీ 127 వికెట్లు తీశాడు.

6 Sixes In 1 Over : ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు కొట్టిన తెలుగు క్రికెట‌ర్‌.. బీసీసీఐ అల‌ర్ట్..

ట్రెండింగ్ వార్తలు