LSG : లక్నోకు భారీ షాక్.. రూ.6.4 కోట్లు పెట్టికొన్న ఆటగాడు ఐపీఎల్‌కు దూరం
తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి మంచి ఉపుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాక్ తగిలింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 3, 2024 / 03:44 PM IST
Shivam Mavi ruled out of IPL 2024
Lucknow Super Giants : తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి మంచి ఉపుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాక్ తగిలింది. పేసర్ శివమ్ మావీ ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. గాయం తిరగబెట్టడంతో అతడు లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఎంతో మిస్ అవుతున్నాను. గాయం నుంచి కోలుకుని వచ్చాను. అద్భుత ప్రదర్శన ఇచ్చి జట్టు విజయాల్లో భాగస్వామ్యం కావాలని భావించాను. అయితే.. దురదృష్టవశాత్తు గాయం తిరగబెట్టింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్‌కు దూరం అవ్వాల్సి వచ్చింది. మాకు అద్భుతమైన జట్టు ఉంది. మేం ఖచ్చితంగా విజేతగా నిలుస్తాం. నేను ఎక్కడ ఉన్నా కూడా జట్టును ఉత్సాహపరుస్తూనే ఉంటాను.’ అంటూ లక్నో సూపర్ జెయింట్స్ పోస్ట్ చేసిన వీడియోలో శివమ్ మావీ తెలిపాడు.
ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో 6.4 కోట్లు వెచ్చించి మరీ శివమ్ మావీని లక్నో జెయింట్స్ దక్కించుకుంది. అయితే.. ఈ సీజన్లో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పాయింట్ల పట్టికలో లక్నో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో లక్నో తన తదుపరి మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఏప్రిల్ 7 ఆదివారం లక్నోలోని ఎకానా స్పోర్ట్జ్ సిటీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
