RCB vs LSG : కోహ్లిని ఔట్ చేస్తాన‌ని మాట ఇచ్చి.. ప‌క్కాగా ప్లాన్ చేసి.. తొలి వికెట్‌గా ఔట్ చేసిన ల‌క్నో యువ స్పిన్న‌ర్‌.. కోచ్ ఆనందం

కెరీర్ ఆరంభంలో మొద‌టి వికెట్‌గా కోహ్లి వికెట్ తీస్తే వ‌చ్చే కిక్కే వేరు.

RCB vs LSG : కోహ్లిని ఔట్ చేస్తాన‌ని మాట ఇచ్చి.. ప‌క్కాగా ప్లాన్ చేసి.. తొలి వికెట్‌గా ఔట్ చేసిన ల‌క్నో యువ స్పిన్న‌ర్‌.. కోచ్ ఆనందం

LSG Coach Langer has revealed how Siddharth fulfilled his promise getting Kohli out

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి వికెట్‌ను తీయాల‌ని ప్ర‌తి ఒక్క బౌల‌ర్ కోరుకుంటాడు. అలాంటిది కెరీర్ ఆరంభంలో మొద‌టి వికెట్‌గా కోహ్లి వికెట్ తీస్తే వ‌చ్చే కిక్కే వేరు. ప్ర‌స్తుతం ఆ ఆనందాన్ని అనుభ‌విస్తున్నాడు ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ యువ లెఫ్టార్మ్ స్పిన్న‌ర్ ఎం సిద్ధార్థ్. కోహ్లి వికెట్ తీస్తాన‌ని అత‌డు ల‌క్నో హెడ్ కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్ కు మాట ఇచ్చాడు. దాన్ని నెర‌వేర్చాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా లాంగ‌ర్ వెల్ల‌డించాడు.

ఈ సీజ‌న్‌లో అరంగ్రేటం చేశాడు స్పిన్న‌ర్ సిద్ధార్థ్‌. మంగ‌ళ‌వారం చిన్న‌స్వామి వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ్డాయి. ఇది సిద్ధార్థ్ కు ఐపీఎల్‌లో రెండో మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో అత‌డు విరాట్ కోహ్లిని పక్కా ప్లానింగ్‌తో ఔట్ చేశాడు. కోహ్లికి బౌలింగ్ చేసేట‌ప్పుడు వ‌రుస‌గా రెండు బంతుల‌ను ఫాస్ట్‌గా వేశాడు. ఆ త‌రువాతి బంతిని కాస్త స్లోగా వేశాడు. ఈ బంతిని కోహ్లి ప్లిక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా బాల్ ఎడ్జ్ తీసుకుంది. బాల్ నేరుగా పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డ‌ర్ చేతికి చిక్కింది.

Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఏకైక భార‌త క్రికెటర్‌.. అల్లంత దూరాన‌ రోహిత్‌శ‌ర్మ‌

మ్యాచ్ అనంత‌రం డ్రెస్సింగ్‌లో రూమ్‌లో హెడ్ కోచ్ లాంగ‌ర్ మాట్లాడిన వీడియోని ల‌క్నో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సిద్ధార్థ్‌తో తన మొదటి చాట్‌ను వివ‌రించాడు జ‌స్టిన్ లాంగ‌ర్. సిద్ధార్థ్‌తో తాను ఇంత‌కు ముందు ఎన్న‌డూ మాట్లాడ‌లేద‌ని చెప్పాడు. అయితే.. అత‌డు ఆర్మ్ బాల్‌ను వేయ‌డం మాత్రం చూశాను. అత‌డిని క‌లిసిన త‌రువాత నేను అత‌డిని అడిగిన మొద‌టి విష‌యం .. మీరు కోహ్లిని ఔట్ చేస్తారా? అని అడిగాను. ఇందుకు సిద్ధార్థ్ త‌ప్ప‌కుండా ఔట్ చేస్తాను అని మాట ఇచ్చాడు. దాన్ని నెర‌వేర్చుకున్నాడు. అని లాంగ‌ర్ తెలిపాడు. దీన్ని విన్న స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు చ‌ప్ప‌ట్ల‌తో సిద్ధార్థ్‌ను అభినందించారు.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 10 మంది బౌల‌ర్లు.. అశోక్ దిండా , ఆశిష్ నెహ్రా , అల్బీ మోర్కెల్ , చెతన్య నందా, డగ్ బ్రేస్‌వెల్, జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ మెక్‌క్లెనాఘన్, హర్‌ప్రీత్ బ్రార్, డెవాల్డ్ బ్రెవిస్, సిద్దార్థ్‌ల మాత్ర‌మే తమ తొలి ఐపీఎల్ వికెట్‌గా కోహ్లిని ఔట్ చేశారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల న‌ష్టానికి 181 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్ (56 బంతుల్లో 81), నికోలస్‌ పూరన్‌(21 బంతుల్లో 40 నాటౌట్‌) లు దంచికొట్టారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఆర్‌సీబీ 19.4 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ల‌క్నో 28 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

Virat Kohli : విరాట్ కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఓడిన ఆట‌గాడిగా..!