Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఏకైక భారత క్రికెటర్.. అల్లంత దూరాన రోహిత్‌శర్మ
క్రికెట్‌లో ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ అయితే ఇప్పుడు విరాట్ కోహ్లి రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు.

Kohli Scripts History Becomes First Indian Ever To Achieve Massive record
క్రికెట్‌లో ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ అయితే ఇప్పుడు విరాట్ కోహ్లి రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను అతడు బద్దలు కొట్టాడు. తాజాగా మరో రికార్డు అతడి ఖాతాలో వచ్చి చేరింది. ఒకే వేదిక పై వంద టీ20 మ్యాచులు ఆడిన ఏకైక భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మంగళవారం లక్నోసూపర్ జెయింట్స్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌తో కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 16 బంతులు ఎదుర్కొని 22 పరుగులు సాధించాడు.
విరాట్ కోహ్లి తరువాత ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అతడు ముంబైలోని వాంఖడే మైదానంలో 80 మ్యాచులు ఆడాడు. వీరిద్దరి తరువాత చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నిలిచాడు. ధోని చెన్నైలోని చెపాక్ మైదానంలో 69 మ్యాచులు ఆడాడు. ఈ ముగ్గురు మాత్రమే ఒకే వేదికపై అత్యధిక మ్యాచులు ఆడారు.
Virat Kohli : విరాట్ కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన ఆటగాడిగా..!
ఒకే వేదికపై అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన భారత ఆటగాళ్లు..
విరాట్ కోహ్లి – 100*మ్యాచులు – బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం
రోహిత్ శర్మ – 80* మ్యాచులు – ముంబైలోని వాంఖడే స్టేడియం
ఎంఎస్ ధోని – 69* మ్యాచులు – చెన్నైలోని చెపాక్ స్టేడియం
చిన్నస్వామి వేదికగా లక్నో, ఆర్‌సీబీ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. క్వింటన్ డికాక్ (56 బంతుల్లో 81), నికోలస్ పూరన్(21 బంతుల్లో 40 నాటౌట్) దంచికొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు కుప్పకూలింది. దీంతో లక్నో 28 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
RCB vs LSG : బెంగళూరు కొంపముంచిన వికెట్ కీపర్ అనూజ్‌రావత్.. ఆ క్యాచ్ పట్టుంటే..!
Virat Kohli ❤? Namma Chinnaswamy
The first Indian cricketer to feature in 100 T20 matches at a single venue. ?#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBvLSG pic.twitter.com/YeHnLFLi02
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 2, 2024