CSK : హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నైకు గట్టి ఎదురుదెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్!
విశాఖలో ఢిల్లీ చేతులో ఓడిన బాధలో ఉన్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

Mustafizur Rahman returns to Bangladesh will miss CSK vs SRH IPL match
Chennai Super Kings : ఐపీఎల్ 17వ సీజన్‌ను రెండు వరుస విజయాలతో మొదలు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఢిల్లీ జట్టు షాకిచ్చింది. విశాఖలో ఢిల్లీ చేతులో ఓడిన బాధలో ఉన్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ స్వదేశానికి వెళ్లిపోయాడు. అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం వీసా పనులు పూర్తి చేసుకునేందుకు అతడు మంగళవారం బంగ్లాదేశ్‌కు వెళ్లాడు.
శుక్రవారం చెన్నై జట్టు ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. యూఎస్‌ఏ వీసా ప్రక్రియ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిన ముస్తాఫిజుర్ దాదాపు వారంలో రోజుల పాటు అక్కడే ఉండే అవకాశం ఉందని సమాచారం. దీంతో అతడు ఎస్ఆర్ఎస్ మ్యాచ్ కు దూరం కానున్నాడు. ఏప్రిల్ 8న కోల్‌కతాతో జరగనున్న మ్యాచ్ నాటికి అతడు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది అని ఇన్‌సైడ్ స్పోర్ట్ తెలిపింది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముస్తాఫిజుర్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో అతడు మూడు మ్యాచులు ఆడాడు. ఏడు వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతడి వద్ద పర్పుల్ క్యాప్ ఉంది. విశాఖ మ్యాచులో చెలరేగిన ధోని ఎస్ఆర్‌హెచ్ మ్యాచులోనూ దుమ్ములేపాలని అతడి అభిమానులు కోరుకుంటున్నాయి. అయితే.. ఢిల్లీతో మ్యాచ్‌లో మహేంద్రుడు కుంటుతూ కనిపించడం ఫ్యాన్స్‌ను కాస్త కంగారు పెడుతోంది.