IND vs AFG : అఫ్గాన్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు.. టీమ్ఇండియాకు భారీ షాక్!
ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో భారత్ నేడు రెండో టీ20 మ్యాచ్‌లో (IND vs AFG)తలపడనుంది.
- Thota Vamshi Kumar
- Updated on- September 15, 2026 / 03:38 PM IST
Big shock to team india ahead of IND vs AFG 2nd T20 Varun to miss rest of series
IND vs AFG : ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో భారత్ నేడు రెండో టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడ్డాడు. దీంతో అతడు నేటి మ్యాచ్‌తో పాటు మూడో టీ20కి సైతం దూరం కానున్నాడు.
తొలి టీ20 మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అతడి స్థానంలో ఇంకా ఎవరిని బీసీసీఐ ఎంపిక చేయలేదు.
గాయాలతో సతమతమవుతున్న వరుణ్ చక్రవర్తి..
గత కొంతకాలంగా వరుణ్ చక్రవర్తి గాయాలతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అతడి కాలి బొటనవేలికి గాయం కావడంతో ఐర్లాండ్ పర్యటనకు దూరం అయ్యాడు. ఆతరువాత ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు రీ ఎంట్రి ఇచ్చినా.. అదే సిరీస్‌లో మూడో టీ20 మ్యాచ్ తరువాత తొడ కండరాల గాయంతో జట్టుకు మరోసారి దూరం అయ్యాడు.
Sanju Samson : బెంచీపై వైభవ్ సూర్యవంశీ.. ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా సంజూ శాంసన్ పరిస్థితి..
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో కోలుకున్నాడు. ఆ తరువాత దేశీయ క్రికెట్‌లో ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకుని అఫ్గాన్‌తో సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. తొలి మ్యాచ్ ఆడిన తరువాత గాయంతో మరోసారి జట్టుకు దూరం అయ్యాడు.
ఇటీవల తన గాయాల పై వరుణ్ స్పందిస్తూ.. ఆటల్లో ప్లేయర్లకు గాయాలు కావడం అత్యంత సహజం అని అన్నాడు. పరిమితులను దాటి ఎంత కష్టపడుతున్నామో ఇవి చూపిస్తాయన్నాడు. శరీరం సహకరించనప్పుడు మరింత బలంగా రీఎంట్రీ ఇవ్వడానికి విరామం తీసుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు.
సెప్టెంబర్ 19 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ లోపు వరుణ్ కోలుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
